- Telugu News Photo Gallery Viral photos These five destinations are perfect for lovers to visit in february
Viral Photos: ఫిబ్రవరిలో ప్రేమికులు సందర్శించడానికి ఈ ప్రదేశాలు సూపర్.. అవేంటంటే..?
Viral Photos: ఫిబ్రవరి నెలని ప్రేమకి చిహ్నంగా చెబుతారు. వాలెంటైన్స్ డే కూడా ఇదే నెలలో వస్తుంది. ఇది ప్రేమికులకు ప్రత్యేకమైనది. మీరు వాలెంటైన్స్
Updated on: Feb 01, 2022 | 7:56 PM

ఫిబ్రవరి నెలని ప్రేమకి చిహ్నంగా చెబుతారు. వాలెంటైన్స్ డే కూడా ఇదే నెలలో వస్తుంది. ఇది ప్రేమికులకు ప్రత్యేకమైనది. మీరు వాలెంటైన్స్ వీక్‌ను ప్రత్యేకంగా జరుపుకోవాలంటే కొన్ని ప్రత్యేక ప్రదేశాలను ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

ఉత్తరాఖండ్‌లోని అందమైన ప్రదేశాలలో నైనిటాల్ ఒకటి. ఇక్కడికి ప్రేమికులు ఎక్కువగా వస్తారు. ఫిబ్రవరి నెలలో తేలికపాటి మంచు, మోస్తరు ఎండలో నైనిటాల్ సందర్శన మంచి వినోదాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ నైని సరస్సు, నైనా దేవి ఆలయం, రాజ్ భవన్, గోవింద్ బల్లభాయ్ పంత్ జూ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

హనీమూన్ గమ్యస్థానాల జాబితాలో గోవా అగ్రస్థానంలో ఉంటుంది. ఇది జంట స్నేహపూర్వక ప్రదేశం. మీరు రాత్రి అందాలను వీక్షించాలనుకుంటే ఇది ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ప్రేమికులు గోవాని చాలా ఇష్టపడుతారు.

మీరు నది, పర్వతాలు, జలపాతాలను చూసి బోరు కొట్టినట్లయితే ఈసారి గుజరాత్ రన్ ఆఫ్ కచ్‌కి వెళ్లండి. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు ఎడారి ఉంటుంది. ఇది 'రాన్ ఆఫ్ కచ్' పేరుతో ప్రసిద్ధి చెందింది.

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరాన్ని బ్లూ సిటీ అంటారు. ఈ ప్రదేశం జంటలు ప్రశాంతంగా గడపడానికి ఉత్తమమైనది. ఇక్కడ మీరు చారిత్రక దృశ్యాలతో శృంగార క్షణాలను ఆస్వాదించవచ్చు.



