uppula Raju |
Updated on: Jan 31, 2022 | 11:45 PM
డయ్యూ ఫోర్ట్ : డామన్ డయ్యూ కోట పసిఫిక్ మహాసముద్రం తీరంలో ఉంటుంది. ఈ కోటపై నుంచి చూస్తే సముద్రానికి సంబంధించిన అందమైన దృశ్యాలను చూడవచ్చు. ఈ కోట దేశీయంగానే కాకుండా విదేశీ ప్రయాణికులను కూడా ఆకర్షిస్తుంది.
అగ్వాడా ఫోర్ట్, గోవా: ఈ కోటపై బాలీవుడ్ ప్రముఖ చిత్రం 'దిల్ చాహ్తా హై'లోని పలు సన్నివేశాలను చిత్రీకరించారు. మీరు ఈ కోటలో పోర్చుగీస్ వాస్తుశిల్పాన్ని చూడవచ్చు.
మురుద్ జంజీరా, మహారాష్ట్ర: ఇది గుడ్డు ఆకారంలో ఉండే ఆకర్షణీయమైన కోట. మహారాష్ట్రలోని మురుద్ తీర గ్రామంలో ఉంటుంది. ఈ కోట సముద్రం తీర అందాలను తిలకించవచ్చు. మీరు మహారాష్ట్ర వెళితే తప్పకుండా ఈ ప్రదేశాన్ని సందర్శించండి.
బేకల్ ఫోర్ట్, కేరళ: కేరళ రాష్ట్రంలో ఉన్న బేకల్ కోట నుంచి కనిపించే సముద్ర దృశ్యం పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తుంది. ఈ కోట పైభాగంలో నిలబడి చూస్తే కేరళ అందాలు చాలా దగ్గరగా కనిపిస్తాయి.
సువర్ణదుర్గ్ కోట, మహారాష్ట్ర: దీనిని గోల్డెన్ ఫోర్ట్ అంటారు. దీని చరిత్ర మరాఠా సామ్రాజ్యంతో ముడిపడి ఉంటుంది. మరాఠాలే ఈ కోటను నిర్మించారని చెబుతారు.