Pushpa: ఇదేంటి ఈ ఆటో అచ్చం అల్లు అర్జున్‌లా మారింది.. నవ్వులు పూయిస్తోన్న ‘పుష్ప ఆటో’ వైరల్‌ ఫోటో..

Pushpa: అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప' ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల భారీ విజయాన్ని..

Pushpa: ఇదేంటి ఈ ఆటో అచ్చం అల్లు అర్జున్‌లా మారింది.. నవ్వులు పూయిస్తోన్న 'పుష్ప ఆటో' వైరల్‌ ఫోటో..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 31, 2022 | 7:13 PM

Pushpa: అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఒక్క బాలీవుడ్‌లోనే ఏకంగా రూ. 100 కోట్లను రాబట్టి అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిందీ చిత్రం. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్‌ నటనకు యావత్‌ దేశం ఫిదా అయ్యింది. తగ్గేదేలా అంటూ సినిమా సెలబ్రిటీలు మొదలు, క్రికెటర్ల వరకు అందరూ బన్నీని ఇమిటేట్‌ చేస్తూ వీడియోలు, రీల్స్‌తో సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నారు.

ఇక సినిమాను ఒంటి చేత్తో విజయ తీరాలకు చేర్చిన బన్నీ మేనేరిజం సినిమాకే హైలెట్‌గా నిలిచిందని చెప్పాలి. బన్నీ పుష్ప చిత్రంలో కాస్త శారీరక వైకల్యం ఉన్న పాత్రలో కనిపించారు. ఇందులో పుష్పరాజ్‌ పాత్ర భుజం కాస్త పెరిగినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకనేగా మీ సందేహం. తాజాగా నెట్టింట పుష్ప పేరుతో వైరల్‌ అవుతోన్న ఓ ఆటో ఫోటో, నవ్వులు పూయిస్తోంది. ఈ ఫోటోలో ఓ ఆటో పైభాగం ఓవైపు పెరిగినట్లు కనిపిస్తోంది. అచ్చంగా పుష్ప చిత్రంలో అల్లు అర్జున్‌ పాత్రను పోలినట్లన్నమాట. అయితే ఇది చాలా సర్వసాధారణమైన విషయం. మనకు రోజులో ఇలాంటి ఎన్నో ఆటోలు దర్శనమిస్తుంటాయి. కానీ ప్రస్తుత సోషల్‌ మీడియాలో కాలంలో కాస్త విభిన్నంగా కనిపించే దేనినైనా వైరల్‌ చేసే నెటిజన్లు ఈ ఆటోను కూడా చక్కర్లు కొట్టిస్తున్నారు.

Pushpa Auto

కాస్త విభిన్నమైన ఆకారంలో కనిపించిందో లేదో ఆటో ఫోటోపై ‘పుష్ప ఆటో’ అని రాసేసి నెటింట్లోకి వదిలేశారు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఓవైపు నవ్వుతూనే మరోవైపు, ఆటోను పుష్పతో పోల్చిన వారి ఐడియాకు హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు. ఏది ఏమైనా సోషల్‌ మీడియా వచ్చాక ప్రతీ అంశం వైరల్‌ అవుతోందడానికి ఈ పుష్ప ఆటో మరో ఉదాహరణగా చెప్పొచ్చు.

Also Read: RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి బిగ్‌అప్‌డేట్‌, విడుదల తేదీ కాన్ఫామ్‌.. ఎప్పుడు రానుందంటే..

Viral Video: ఒకే స్టోర్‌లో 22 సార్లు దోపిడీ చేశాడు.. లైవ్‌గా దొరికినా వదిలేసిన జడ్జి.. ఎందుకో తెలుసా?