Acharya: చిరు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆచార్య వచ్చేస్తున్నాడు.. విడుదల తేదీ ప్రకటన..
Acharya: ఇలా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల తేదీని ప్రకటించిందో లేదో అలా ఆచార్య యూనిట్ స్పందించింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల తేదీని ప్రకటించిన కాసేపటికే ఆచార్యం టీమ్ కూడా...
Acharya: కరోనా థార్డ్ వేవ్ కారణంగా సైలెంట్ అయిన సినిమా ఇండస్ట్రీ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తేదీ ప్రకటనతో ఒక్కసారిగా జోరు పెరిగింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తేదీని ప్రకటించడంతో ఇతర సినిమాలు కూడా విడుదల తేదీని ప్రకటిస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను మార్చి 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే ఆచార్య చిత్ర యూనిట్ స్పందించింది. ఇలా ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర యూనిట్ నుంచి ప్రకటన రాగానే, ఆచార్య టీమ్ సినిమా డేట్‌ను ప్రకటించింది.
ఈ విషయమై ఆచార్య యూనిట్ స్పందిస్తూ.. ‘కొన్ని ఆరోగ్యకరమైన చర్చల అనంతరం, పరస్పర అవగాహన మేరకు, ఆర్‌ఆర్‌ఆర్ మార్చిన 25న వస్తున్న తరుణంలో మేము ఆచార్య సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేయనున్నాము’ అంటూ పోస్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆచార్య సినిమాపై భారీగా అంచనాలున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల తేదీ ప్రకటించిన నేపథ్యంలో ఆచార్య విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ కనిపిస్తుండగా, చెర్రీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.
ఇదిలా ఉంటే ఇటు ఆర్‌ఆర్‌ఆర్, ఆచార్య విడుదల తేదీలను ప్రకటించగానే అటు భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ కూడా విడుదల తేదీపై ఓ ప్రకటన చేసింది. పవన్ కళ్యాణ్, రానాలు హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. మరి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న రాధేశ్యామ్ యూనిట్ కూడా సినిమా తేదీని ఎప్పుడు ప్రకటించనున్నారనే ప్రశ్న డార్లింగ్ ఫ్యాన్స్‌ను వేధిస్తోంది. మరి రాధేశ్యామ్ యూనిట్ కూడా ఏదైనా ప్రకటన చేస్తుందో చూడాలి.