Megastar Chiranjeevi: మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్.. అభిమాని కుటుంబానికి ఏం చేశారో తెలుసా?

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi).. కేవలం సినిమాల పరంగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించారు. బ్లడ్ బ్యాంక్ (Blood Bank), ఐ బ్యాంక్ (Eye Bank),  ఆక్సిజన్ బ్యాంక్.. సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు మెగాస్టార్.

Megastar Chiranjeevi: మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్.. అభిమాని కుటుంబానికి ఏం చేశారో తెలుసా?
Follow us
Basha Shek

|

Updated on: Feb 02, 2022 | 8:10 AM

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi).. కేవలం సినిమాల పరంగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించారు. బ్లడ్ బ్యాంక్ (Blood Bank), ఐ బ్యాంక్ (Eye Bank),  ఆక్సిజన్ బ్యాంక్.. సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు మెగాస్టార్. ఇక కరోనా(Corona Crisis)  కాలంలో ఎంతోమందికి ఆపన్న హస్తం అందించారాయన. ఇక తననెంతో అభిమానించే ఫ్యాన్స్ కు కష్టాల్లో ఉంటే వెంటనే స్పందిస్తారు. ఆపన్నహస్తం అందిస్తారు. అలా  ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నమరో అభిమానికి చేయూతనందించారు చిరంజీవి . వివరాల్లోకి వెళితే..

కూతురు పెళ్లికి ఆర్థిక సాయం..

రాజం కొండలరావు అనే ఓ వీరాభిమాని చాలా ఏళ్లుగా చిరంజీవి చేపట్టిన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు . అఖిల భారత చిరంజీవి యువత తరపున కూడా ఎంతో చురుగ్గా ఉంటూ సేవలందించారు. గతంలో ఈయన చాలా సార్లు మెగాస్టార్ ని స్వయంగా కలిశారు కూడా. ఇటీవల ఆయన కూతురు నీలవేణికి పెళ్లి కుదిరింది.  అయితే ప్రస్తుతం కొండలరావు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.   ఈ విషయాన్ని అఖిల భారత చిరంజీవి యువత మెగాస్టార్ వద్దకు తీసుకెళ్లారు.  ఈ విషయం తెలుకున్న చిరంజీవి వెంటనే కొండలరావు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఈ విషయాన్ని అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మెగాస్టార్ బాటలోనే నడిచే అభిమానులమైన మేం కూడా పెళ్లికూతురికి అభినందనలతో పాటూ హితోదికంగా మాకు తోచినంత ఆర్థిక సాయం అందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కొత్త జంటను ఆ భగవంతుదు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం’ అని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.

ఇక సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి నటించిన ‘ఆచార్య’ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు మరో నాలుగు సినిమాలను లైన్ లో పెట్టేశారు. వీటిలో లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్, వేదాళం రీమేక్ భోళాశంకర్ సినిమాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు కే.ఎస్.రవీంద్ర (బాబీ), వెంకీ కుడుముల చిత్రాలకు కూడా పచ్చజెండా ఊపారు.

Also Read:Health Tips: నిత్యం ఆ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్‌ టిప్స్‌ మీకోసమే

Mohammad Azharuddin: ఆరోజు ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు.. హ్యాట్రిక్ సెంచరీల నాటి మధురానుభవాలను గుర్తు చేసుకున్న అజహరుద్దీన్..

Mohammad Azharuddin: ఆరోజు ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు.. హ్యాట్రిక్ సెంచరీల నాటి మధురానుభవాలను గుర్తు చేసుకున్న అజహరుద్దీన్.. .