జంతు ప్రదర్శనశాలలో దారుణం.. జూ కాపలదారునిపై దాడి చేసి చంపిన సింహం.. తర్వాత వేరే సింహంతో పరార్
జంతు ప్రదర్శన శాలలో అప్పుడప్పుడు ప్రమాదం జరుగుతుంటుంది. ఓ సింహం అక్కడ కాపలగా ఉన్న వ్యక్తిపై దాడి చేసి దారుణంగా హతమార్చి మరో సింహంతో వెళ్లిపోయింది. ఈ ఘటన..
జంతు ప్రదర్శన శాలలో అప్పుడప్పుడు ప్రమాదం జరుగుతుంటుంది. ఓ సింహం అక్కడ కాపలాగా ఉన్న వ్యక్తిపై దాడి చేసి దారుణంగా హతమార్చి మరో సింహంతో వెళ్లిపోయింది. ఈ ఘటన ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు నైరుతిగా 144 కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్కాజీ ప్రావిన్సుల్లోని అరక్ జూలో చోటు చేసుకుంది. మర్కాజీ ప్రావిన్స్‌లోని అరక్ జంతు ప్రదర్శనశాలలో చాలా కాలం నుంచి ఎస్పందానీ జాతికి చెందిన ఓ సింహం నివసిస్తోంది. అయితే ఆ బోను తలుపులను తెరిచిన సింహం.. ఆహారాన్ని అందించేందుకు వెళ్లిన కాలపదారుడి (40)పై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆయన.. అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక దాడి చేసిన అనంతరం బోనులో నుంచి బయటకు వచ్చిన సింహం మరో సింహంతో కలిసి తప్పించుకుంది. ఈ ఘటనను చూసిన చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే జూ నుంచి తప్పించుకుని పారిపోతున్న రెండు సింహాలను చూసి జూ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఈ విషయాన్ని అధికారులు భద్రతా బలగాలకు తెలియజేయడంతో వారు రంగంలోకి దిగారు.
జూను భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రావిన్సుల గవర్నర్ అమిర్ హాది తెలిపారు. జూ నుంచి పారిపోయిన ఆ రెండు సింహాలను కొంత దూరంలో పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఎవరైనా కావాలని సింహం బోను తెరిచారా..? లేక సింహమే ఆ బోను తెరుచుకుని అతనిపై దాడి చేసిందా అనే దానిపై దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. అయితే 6 అడుగుల 6 అంగుళాల పొడవు ఉన్న ఈ జంతువు.. ముందు రోజు రాత్రి తన ఆవరణలో సరిగ్గా కంచె వేయలేదని ఓ వార్త సంస్థ నివేదించింది.
ఈ జూలో 46 జతులకు చెందిన 460 జంతువులు
కాగా, ఈ జంతుప్రదర్శన శాలలో 46 జాతులకు చెందిన 460 వరకు జంతువులు, వణ్యప్రాణాలు ఉన్నట్లు జూ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన జరగడంతో అక్కడున్న ప్రజలందరు భయాందోళనకు గురయ్యారు.