Covid-19: కరోనా లక్షణాలు లేకుంటే.. ఐసోలేషన్ అవసరం లేదు.. ఆ దేశంలో ఆంక్షలు ఎత్తివేత
Covid-19 Isolation Rules: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇంకా విజృంభిస్తూనే ఉంది. రోజురోజుకూ పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్లు ఇంకా అలజడి రేపుతున్నాయి. ఈ తరుణంలో
Covid-19 Isolation Rules: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇంకా విజృంభిస్తూనే ఉంది. రోజురోజుకూ పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్లు ఇంకా అలజడి రేపుతున్నాయి. ఈ తరుణంలో దక్షిణాఫ్రికా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన విషయం తెలిసిందే. అయితే థర్డ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆంక్షలను సడలించింది. ముఖ్యంగా కరోనా సోకిన వారికి లక్షణాలు లేకుంటే అసలు ఐసోలేషన్‌లో ఉండాల్సిన అవసరమే లేదని ప్రకటించింది. అంతేకాకుండా పాఠశాలల్లో భౌతికదూరం ఉండాలంటూ విధించిన ఆంక్షలను కూడా ఎత్తివేస్తున్నట్లు దక్షిణాఫ్రికా ప్రభుత్వం తాజాగా స్పష్టంచేసింది. తాజా నిబంధనల ప్రకారం.. ఆ (South Africa) దేశంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారికి లక్షణాలేమీ లేకుంటే ఐసోలేషన్ అవసరం లేదు. ( Covid-19) టెస్టు తర్వాత లక్షణాలు కనిపిస్తే మాత్రం ఏడు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
కరోనా భాధితులకు సన్నిహితంగా మెలిగిన వారిలో కూడా లక్షణాలు లేకుంటే వారు కూడా ఐసోలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. నేషనల్ కరోనా వైరస్ కమాండ్ కౌన్సిల్‌తోపాటు ప్రెసిడెంట్ కోఆర్డినేటింగ్ కౌన్సిల్ ఇచ్చిన నివేదికల ఆధారంగానే ఈ ఆంక్షలను సడలించినట్లు దక్షిణాఫ్రికా అధ్యక్ష కార్యాలయం ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా 60 నుంచి 80 శాతం ప్రజల్లో కొవిడ్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఉన్నట్లు ఇప్పటివరకు వచ్చిన సీరో సర్వేల నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్ష కార్యాలయం తెలిపింది.
అంతేకాకుండా పాఠశాలల్లో భౌతిక దూరం ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే, బహిరంగ ప్రదేశాల్లో మాత్రం మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించింది. అంతేకాకుండా ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారు తక్షణమే తీసుకోవాలని పేర్కొంది.
Also Read: