AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: మరణ వాంగ్మూలం ఉంటే శిక్ష వేయవచ్చు.. హత్య కేసులో కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు..!

Supreme Court: దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. హత్యలు, అత్యాచారాలు ఇలా ప్రతి రోజు జరుగుతూనే ఉన్నాన్నాయి. కేసుల్లో ఉన్న నిందితులకు కోర్టులు రకరకాల శిక్షణ వేస్తుంటుంది...

Supreme Court: మరణ వాంగ్మూలం ఉంటే శిక్ష వేయవచ్చు.. హత్య కేసులో కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు..!
Supreme Court
Subhash Goud
|

Updated on: Feb 02, 2022 | 7:49 AM

Share

Supreme Court: దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. హత్యలు, అత్యాచారాలు ఇలా ప్రతి రోజు జరుగుతూనే ఉన్నాన్నాయి. కేసుల్లో ఉన్న నిందితులకు కోర్టులు రకరకాల శిక్షణ వేస్తుంటుంది. హత్యలకు సంబంధించిన కేసులు చాలా కాలం పాటు కోర్టులో కొనసాగుతుంటాయి. ఇక తాజాగా సుప్రీం కోర్టు (Supreme Court) ఓ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. మరణ వాంగ్మూలం ఆధారంగా నిందితుడికి శిక్ష వేయవచ్చని, వేరే సాక్ష్యం అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిందితులను నిర్ధోషులుగా ప్రకటిస్తూ ఆలహాబాద్‌ హైకోర్టు (Allahabad High Court) ఇచ్చిన తీర్పును పక్కన పెట్టేసింది. ఓ కేసులో మహిళను ఆమె మావ, బావ కలిసి నిప్పంటించి హత్య చేశారు. అయితే ఆమె చనిపోయే ముందు మెజిస్ట్రేట్‌ (Magistrates) ముందు వాగ్మూలం ఇచ్చింది. దీని ఆధారంగా ట్రయల్‌ కోర్టు (Trial‌ Court) నిందితులకు జీవిత ఖైదు (Life Imprisonment) విధించింది.అయితే మరణ వాంగ్మూలానికి మద్దతుగా వేరే సాక్ష్యం లేదంటూ ట్రయల్‌ కోర్టు తీర్పును అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేసింది. దీనిపై విచారించిన న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ బి.వి.నాగరత్నలతో కూడిన సుప్రీం కోర్టు.. మరణ వాంగ్మూలం నిజమని.. న్యాయస్థానం సంతృప్తి పడినట్లయితే ఇంకా వేరే సాక్ష్యం అందించాల్సిన అవసరం లేదని, శిక్ష వేయవచ్చని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

ఏటీఎం చోరీకి అంతా ఓకే.. అప్పుడే ఓ వాహనం రావడంతో సీన్ రివర్స్.. చివరకు..

Matka gang: అనంతలో మట్కా జోరు.. బెట్టింగ్ బాబాయిల ఆట కట్టించిన పోలీసులు..!నిర్వాహకుల అరెస్టు