Matka gang: అనంతలో మట్కా జోరు.. బెట్టింగ్ బాబాయిల ఆట కట్టించిన పోలీసులు..!నిర్వాహకుల అరెస్టు
Betting Gang: అనంతపురం జిల్లాలో పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్ జూదలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తమ సిబ్బంది తో ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి ఆయా పరిధిలోని ముగ్గురు మట్కా
Betting Gang: అనంతపురం జిల్లా(Anantapur district)లో పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్ జూదలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తమ సిబ్బంది తో ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి ఆయా పరిధిలోని ముగ్గురు మట్కా నిర్వాహకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుండి 4లక్షల రూపాయలకు పైగా నగదు, 2 సెల్ ఫోన్ లు, మట్కా చీటీలు, పెన్నులు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి నరసింగప్ప వివరించారు. జిల్లాలో జూదాలు, మట్కాలు(Gambling), క్రీకెట్ బెట్టింగ్ జరుగకుండా నియంత్రించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే విజయనగర్ కాలనికి చెందిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 56వేల 570 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ ముగ్గురు మట్కా నిర్వాహకులను కోర్టుకు తరలించారు.
Also Read: నా సినిమా విడుదల రోజు కూడా ఆస్టార్ హీరో సినిమాకే వెళ్తాను.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు..