Eggs: డయాబెటిస్ ఉన్నవాళ్లు గుడ్లు తింటే గుండెకు మంచిదేనా..? తాజా పరిశోధనలలో కీలక విషయాలు
Eggs: ప్రస్తుతం మధుమేహం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఇతర కారణాల వల్ల డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఈ రోజుల్లో..

Eggs: ప్రస్తుతం మధుమేహం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఇతర కారణాల వల్ల డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో మధుమేహం బారిన పడేవారున్నారు. మధుమేహం ఉన్నవారు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది తినాలి.. ఏది తినొద్దు అనే దానిపై దృష్టి పెట్టాలి. అయితే కోడిగుడ్డు విషయంలో మాత్రం డయాబెటిస్ రోగులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. తాము కోడిగుడ్లు తింటే గుండె జబ్బులు వస్తాయని చాలా మంది డయాబెటిస్ రోగులు భయపడుతుంటారు. అందుకే కోడిగుడ్లకు పూర్తిగా దూరంగా ఉంటారు. కానీ అందులో వాస్తవం లేదని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..
డయాబెటిస్ రోగుల్లో కోడిగుడ్లు తిననివారికంటే తినే వారిలోనే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అధ్యయనంలో తేలింది.ముఖ్యంగా ప్రీ-డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారిలో గుడ్డువల్ల గుండె సమస్యలు తగ్గినట్లు అధ్యయనం ద్వారా తేలింది. సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన ఈ అధ్యయనం ప్రకారం.. కోడిగుడ్డు మధుమేహం ఉన్న వారికి మంచిదే. డయాబెటిస్ ఉన్న వారు సంవత్సరం పాటు వారానికి 1 నుంచి12 గుడ్లు తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
పరిశోధన సాగిందిలా..
పరిశోధకులు జరిపిన అధ్యయనంలో పాల్గొన్న వారిని పరిశోధకులు మొత్తం మూడు గ్రూపులుగా విభజించారు. వారిలో ఒక్కొక్కరికి గరిష్టంగా వారానికి 12 గుడ్లు, కనిష్టంగా ఒక గుడ్డు చొప్పున అందించారు. ఇలా మూడు నెలలపాటు వారికి గుడ్లు అందిస్తూ వచ్చారు పరిశోధకులు. చివరిగా అందరి ఆరోగ్యాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో వారానికి 12 గుడ్లు తిన్నవారిలో కూడా గుండె సంబంధిత వ్యాధులకు కారణమయ్యే ప్రమాదాలు ఏవీ కనిపించలేదట. అందుకే గుడ్లు తినేవారిలో గుండె ముప్పు చాలా తక్కువగా ఉంటుందని గుర్తించారు. గుడ్లలో ఉండే ప్రొటీన్స్, సూక్ష్మ పోషకాలు డయాబెటిస్ ఉన్న వారికి ఎంతో ఉపయోగమని నిర్ధారణకు వచ్చారు పరిశోధకులు.
ఇవి కూడా చదవండి:




