Rice Side Effects: రోజూ మూడు పూటలు అన్నం తింటున్నారా ? దానివల్ల కలిగే నష్టాలు తెలుసుకోండి..
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. చిన్న మెతుకు కింద పడకుండా తినాలని.. సక్రమమైన దిశలో కూర్చుని భూజించాలి.
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. చిన్న మెతుకు కింద పడకుండా తినాలని.. సక్రమమైన దిశలో కూర్చుని భూజించాలి. అన్నంను కాలితో తాకడం చేయకూడదు. తినడానికి ముందు దేవుడిని మనస్సులో స్మరించుకుని.. అన్నదాత సుఖిభవ అనుకొని తినాలి.. ఇలా ఒక్కటేమిటీ ఎన్నో ఆచార సంప్రదాయ విషయాలను చెబుతుంటారు పెద్దవారు. మన దేశంలో రోజూలో మూడు అన్నం తింటుంటాం.. దక్షిణాదిలో అన్నం రోజూలో మూడు తింటే.. ఉత్తరాదిలో మాత్రం ఎక్కువగా చపాతీలు, రోటీలు తిని గడిపేస్తుంటారు. అయితే మూడు పూటల అన్నం ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదట..
ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు కాదు.. నిజమే.. మీరు విన్నది..మూడు పూటల అన్నం ఎక్కువగా తినడం అనారోగ్య సమస్యలను కలిస్తుందట. ఎలాగో తెలుసుకుందామా..
అన్నం ఎక్కువగా తినడం వలన సులభంగా బరువు పెరుగుతారు. అన్నంలో ఉండే క్యాలరీలు బరువు పెరిగేందుకు సహాయపడతాయి. బరువు తగ్గడం కోసం డైటింగ్ చేసేవారు అన్నం తక్కువగా తీసుకోవడం మంచిది. అన్నం త్వరగా కడుపు నింపుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఎక్కువగా తినడం వలన కడుపు ఉబ్బరం సమస్య తీవ్రంగా వేధిస్తుంది. అన్నం తిన్న వెంటనే బెడ్ ఎక్కేస్తే అనారోగ్య సమస్యలు కలుగుతాయట. అందుకే తిన్న వెంటనే పడుకోకుండా.. కాస్త శారీరానికి శ్రమ కలిగించాలి.
మధుమేహ రోగులు అన్ని పూటలు అన్నం తినకూడదు. ఇది వ్యాధి ప్రభావన్ని మరింత పెంచుతుంది. అన్నంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. దీంతో శరీరంలో చక్కెర పరిమాణం పెరుగుతుంది. చాలమందికి బియ్యం తినడం అలవాటు ఉంటుంది. ఇలా తినడం అస్సలు మంచిది కాదు సుమీ.. ఎందుకంటే బియ్యం ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుందట. అంతేకాదు.. అన్నం అధిక మోతాదులో తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందట.