Tribal University: ఆర్థిక శాఖ పరిశీలనలో గిరిజన విశ్వవిద్యాలయం.. ఏర్పాటుపై కేంద్రం మరోసారి క్లారిటీ..
Tribal University in Telangana: తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రతిపాదన ప్రస్తుతం ఆర్థికశాఖ పరిశీలనలో ఉందని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ పేర్కొంది. గిరిజన వర్సిటీ ఆమోదం కోసం
Tribal University in Telangana: తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రతిపాదన ప్రస్తుతం ఆర్థికశాఖ పరిశీలనలో ఉందని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ పేర్కొంది. గిరిజన వర్సిటీ ఆమోదం కోసం ఫైల్ ప్రస్తుతం ఆర్థికశాఖ దగ్గర ఉందని కేంద్ర విద్యాశాఖ స్పష్టంచేసింది. యూనివర్సిటీ (Tribal University) కార్యకలాపాలు ప్రారంభమయ్యాక యూజీసీ నిధులు కేటాయిస్తుందని పేర్కొంది. గిరిజన వర్సిటీ ఏర్పాటుపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అడిగిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ములుగు (భూపాలపల్లి) లో (Mulugu) యూనివర్సిటీ ఏర్పాటవుతుందని సమాధానమిచ్చింది. వర్సిటీ ఏర్పాటు సమగ్ర ప్రాజెక్టు నివేదికపై ఇప్పటికే సంబంధిత మంత్రిత్వ శాఖల సంప్రదింపులు పూర్తయినట్లు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి గిరిజన విశ్వవిద్యాలయం బిల్లును ప్రవేశపెట్టాలన్న డిమాండ్ పలు పార్టీల నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పటికే కేంద్ర బృందం సైతం యూనివర్సిటీ ఏర్పాటుకు స్థలాన్ని సైతం పరిశీలించింది.
కాగా.. గతేడాది సెప్టెంబర్‌లో ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన సందర్భంలో దీనిపై ప్రస్తావింంచారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94, షెడ్యూల్ 13(3) ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ప్రధానికి వివరించారు. ఈ మేరకు వరంగల్ సమీపంలోని ములుగు జిల్లా జాకారం వద్ద 200 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని పత్రాలను కేంద్ర విద్యాశాఖకు అందజేశామని.. వీలైనంత త్వరగా అక్కడ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కోరారు.
Also Read: