Sarayu Roy: బిగ్‌బాస్ ఫేమ్ సరయు అరెస్ట్.. స్టేషన్‌కు తరలించిన బంజారాహిల్స్ పోలీసులు

Bigg Boss Telugu 5 Contestant Sarayu Roy: బోల్డ్ కామెంట్స్‌తో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టెంట్, యూట్యూబ్‌ నటి సరయుపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Sarayu Roy: బిగ్‌బాస్ ఫేమ్ సరయు అరెస్ట్.. స్టేషన్‌కు తరలించిన బంజారాహిల్స్ పోలీసులు
Sarayu Arrest
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 07, 2022 | 11:05 PM

Bigg Boss Telugu 5 Contestant Sarayu Roy: బోల్డ్ కామెంట్స్‌తో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టెంట్, యూట్యూబ్‌ నటి సరయుపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఓ హోటల్ ప్రచారపాటలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని వీహెచ్‌పీ నేత సరయూపై (Sarayu) ఫిర్యాదు చేశారు. అయితే.. ఆ వీడియో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందన్న అభియోగంపై 153a, 295a సెక్షన్ ల కింద బంజారాహీల్స్‌ (Banjara Hills Police) పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు యూట్యూబ్ నటి సరయుని బంజారాహిల్స్ పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ అభ్యంతరకర వీడియోపై రాజన్న సిరిసిల్ల విశ్వ హిందూ పరిషత్ (Vishva Hindu Parishad) అధ్యక్షుడు చేపూరి అశోక్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాజన్న సిరిసిల్ల(Rajanna Sircilla) పోలీసులు.. ఆ తర్వాత కేసును హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు.

హోటల్‌ ప్రమోషన్ సాంగ్‌లో సరయుతో పాటు మరికొందరు గణపతి బప్పా మోరియా బ్యాండ్‌ను తలకు ధరించారని అశోక్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. దేవుడి బొమ్మలు ధరించి.. లిక్కర్ సేవించి హోటల్‌ను సందర్శిస్తారనే సంకేతాన్ని ఆ ప్రమోషన్ సాంగ్‌తో సందేశాన్ని పంపుతున్నారని వెల్లడించారు. ఈ విధంగా ప్రవర్తించి హిందువుల మనోభావాలను కించపరినందుకు తగిన చర్యలు తీసుకోవాలని చేపూరి అశోక్ పోలీసులను కోరారు. ఇలాంటి చర్యలను హిందూ సమాజం సహించదన్నారు.

బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నిలిచిన వీజే సన్నీ హీరోగా నటించిన ‘సకల గుణాభిరామ’ మూవీ విడుదలకు సిద్దమువుతోంది. ఈ చిత్రం బిగ్ బాస్ ముందే ఆయన చేసినప్పటికి కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. త్వరలో బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో సరయు నటించింది.

Also Read:

Actor Photo: మొదటి సినిమాతోనే అమ్మాయిల మనసు దోచుకున్న ఈ స్టార్.. సీనియర్ హీరో తనయుడు..ఎవరో గుర్తుపట్టండి..

Sarkaru Vaari Paata: ప్రేమికుల రోజున స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్న మహేష్.. సర్కారు వారి పాట నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..