Suryapet: విషాదం.. వెల్డింగ్ పనులు చేస్తుండగా పేలిన పెట్రోల్ ట్యాంకర్.. ఇద్దరు మృతి
Petrol Tanker Blast: తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఘరో ప్రమాదం చోటుచేసుకుంది. ఖాళీ పెట్రోలు ట్యాంకర్‌కు వెల్డింగ్ చేస్తుండగా.. అది పేలిపోయి ఇద్దరు మృతి చెందారు.
Petrol Tanker Blast: తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఘరో ప్రమాదం చోటుచేసుకుంది. ఖాళీ పెట్రోలు ట్యాంకర్‌కు వెల్డింగ్ చేస్తుండగా.. అది పేలిపోయి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ఈ విషాద ఘటన సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెట్రోల్, డీజిల్ తరలించే ట్యాంకు వాల్ లీక్ అవుతుండటంతో.. కొత్త బస్టాండ్ సమీపంలోని హైదరాబాద్-విజయవాడ రహదారి పక్కనున్న సర్వీస్ సెంటర్‌కు ట్యాంకర్‌ను తీసుకెళ్లారు. ఈ క్రమంలో వెల్డింగ్ వర్కర్ మంత్రి అర్జున్ (36) దానికి వెల్డింగ్ పనులు చేస్తున్నారు. అయితే.. ఖాళీ ట్యాంకర్ (Tanker Blast) అయినప్పటికీ దానిలో గ్యాస్ ఫామ్ కావడంతో ట్యాంకర్‌కు మంటలు అంటుకొని పేలిపోయింది. ఈ ప్రమాదంలో సూర్యాపేట కోటమైసమ్మ బజారుకు చెందిన వెల్డింగ్ వర్కర్ మంత్రి అర్జున్, ట్యాంకర్ డ్రైవర్ గట్టు అర్జున్ (52) అక్కడికక్కడే మృతి చెందారు. వెల్డింగ్ వర్కర్ ఏర్పుల మల్లయ్య, మరో లారీ డ్రైవర్ మేడె వెంకటరమణకు గాయాలయ్యాయి. ఏర్పుల మల్లయ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. అతనికి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.
పేలుడు ధాటికి ట్యాంకర్ పూర్తిగా తునాతునకలైంది. సమీపంలోని నాలుగు దుకాణాల అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ఒక్కసారిగా పేలుడుతో ఈ ప్రాంతంలో బీతావాహ వాతావరణం నెలకొంది. పేలుడు సమయంలో ఈ ప్రాంతవాసులు భయంతో పరుగులు తీశారు.
Also Read: