Big News Big Debate: టీఆర్ఎస్‌ – బీజేపీ మధ్య ముదిరిన వివాదాలు.. విగ్రహాలపై ఏమిటీ రాజకీయ ఆగ్రహం..

Big News Big Debate: అంశమేదైనా తెలంగాణలో బీజేపీ- టీఆర్ఎస్‌ మధ్య వివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. రాజకీయంగానూ పెను దుమారమే రేపుతోంది. మొన్న రాజ్యాంగం రీరైట్‌ చేయాలన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై

Big News Big Debate: టీఆర్ఎస్‌ - బీజేపీ మధ్య ముదిరిన వివాదాలు.. విగ్రహాలపై ఏమిటీ రాజకీయ ఆగ్రహం..
Big News Big Debate Live Video 07 02 2022 On Trs Vs Bjp Over On Constitution Rules Change
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 07, 2022 | 9:59 PM

Big News Big Debate: అంశమేదైనా తెలంగాణలో బీజేపీ- టీఆర్ఎస్‌ మధ్య వివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. రాజకీయంగానూ పెను దుమారమే రేపుతోంది. మొన్న రాజ్యాంగం రీరైట్‌ చేయాలన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై తాజాగా ఎంట్రీ ఇచ్చిన బీజేపీ లీగల్‌ సెల్ ‌సీఎంపైనే దేశద్రోహం కేసు పెడతామంటోంది. అయితే ముందు సింగరేణి సంగతి తేల్చాలని టీఆర్ఎస్‌ కౌంటర్‌ ఎటాక్ తో సీనులోకి వచ్చింది. SC, ST, BCలు అధికంగా ఉపాథి పొందుతున్న బొగ్గు గనులను బడాబాబులకు అప్పగించే కుట్రపై లేఖాస్త్రం సంధించింది గులాబీ దళం. ఇక ప్రోటోకాల్‌ వివాదం నడుస్తుండగా తాజాగా అంబేద్కర్‌ విగ్రహంపై పార్టీల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి.

కేంద్ర బడ్జెట్‌పై రాజుకున్న చిచ్చు రగులుతూనే ఉంది. రాజ్యాంగంపై KCR చేసిన వ్యాఖ్యలు BJP-TRS‌ మధ్య మాటలయుద్ధాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లింది. రచ్చ రాజుకుంటుండగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ టూరు మరింత ఆజ్యం పోసింది. KCR స్వాగతం పలకడానికి రాకపోవడంతో కమలనాథులు విమర్శలకు పదను పెట్టారు. రాజ్యాంగంపైనా గౌరవం లేదు. ప్రధాని ప్రొటోకాల్‌ పాటించకుండా అవమానించారంటూ బీజేపీ శ్రేణులు మాటలదాడి చేశాయి. వెంటనే రియాక్ట్‌ అయింది TRS. PM మోదీ ప్రైవేటు కార్యక్రమానికి వస్తే ముఖ్యమంత్రి స్వాగతం పలకాలని ఎక్కడా లేదంటూ ట్వీట్‌తో ఫుల్‌ క్లారిటీ ఇచ్చారు. ప్రైవేటు అయినా ప్రభుత్వమైనా స్వాగతం పలకడం బాధ్యత అంటోంది బీజేపీ. ఈ చిచ్చు ఆరకముందే అంబేద్కర్‌ విగ్రహంపైకి మళ్లింది వివాదం. కేసీఆర్‌ రాజ్యాంగం మార్చాలన్న వ్యాఖ్యలకు నిరసనగా అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపి బీజేపీ విగ్రహం వివాదం తెరమీదకు తీసుకొచ్చింది. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం కడతామన్న కేసీఆర్‌ 2022 వచ్చినా అతీగతీ లేదంటూ విమర్శలు గుప్పించారు. మతోన్మాదంతో రగిలిపోయే బీజేపీకి అంబేద్కర్‌ పేరు పలికే అర్హత కూడా లేదని ఎదురు దాడి చేస్తోంది TRS.

లేటెస్టుగా గొడవ కాస్తా సింగరేణి వైపు మళ్లింది. బేజో ఇండియా బడ్జెట్‌ అంటూ కేటీఆర్‌ కేంద్రాన్ని విమర్శించారు. అంతేకాదు సింగరేణి అమ్మాలన్న ఆలోచన మానుకోవాలంటూ కేంద్రానికి లేఖాస్త్రం సంధించారు. సింగరేణి జోలికి వస్తే మాడి మసైపోతారంటూ వార్నింగ్ ఇస్తున్నారు గులాబీ ప్రజాప్రతినిధులు. ఈక్వాలిటీ ఫర్‌ తెలంగాణ పేరుతో రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై ఉద్యమిస్తోంది TRS‌. అటు నిధులు, ప్రాజెక్టుల విషయంలో జరిగిన అన్యాయంపై గళమెత్తుతున్నారు. దీంతో రాజకీయంగానే ఎదురుదాడి చేస్తోంది బీజేపీ. రాజ్యాంగం మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలనే బలంగా జనాల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా దేశద్రోహం కేసు వేయాలని నిర్ణయించింది బీజేపీ. అటు నిర్మలా సీతారామన్‌, కిషన్‌ రెడ్డి పట్ల కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపైనా న్యాయపోరాటం చేస్తామంటోంది టీఆర్‌ఎస్.

పక్షపాతానికి ఐకాన్‌ అయిన వ్యక్తులే సమతా విగ్రహాలు ఆవిష్కరించాలని కేటీఆర్‌ ట్వీట్‌ చేస్తే.. వంద కోట్ల హిందువులను 15 నిమిషాల్లో చంపుతామన్న ఒవైసీలకు మద్దతు ఇచ్చిన మీరు ఎవరంటూ ప్రశ్నించారు కిషన్‌ రెడ్డి. మొత్తానికి అటు గులాబీ దళం.. ఇటు కాషాయశ్రేణులు ఎవరికి వారు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. మరి బడ్జెట్‌ నుంచి ప్రోటోకాల్‌ మీదుగా సింగరేణి వరకూ సాగుతున్న ఈ వివాదాలకు ముగింపు శుభం కార్డు పడుతుందా..? లేక రచ్చ ఇంకా కంటిన్యూ అవుతుందో చూడాలి.

(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)

ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి.