Eye Glasses: కళ్లద్దాలని క్లీన్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. గ్లాసెస్‌ పనికిరావు..?

Eye Glasses: నిత్యం ధరించే కళ్లద్దాలని క్లీన్ చేయడానికి ప్రజలు క్లాత్‌ లేదా దుపట్టాలాంటి వస్త్రాన్ని ఉపయోగిస్తారు. కాని గ్లాస్‌ క్లీనింగ్‌కి ఇది సరైన పద్దతి కాదు. ఇలా చేయడం వల్ల మీ కళ్లపై చెడు

Eye Glasses: కళ్లద్దాలని క్లీన్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. గ్లాసెస్‌ పనికిరావు..?
Eye Glasses Tips
Follow us
uppula Raju

|

Updated on: Feb 08, 2022 | 8:29 AM

Eye Glasses: నిత్యం ధరించే కళ్లద్దాలని క్లీన్ చేయడానికి ప్రజలు క్లాత్‌ లేదా దుపట్టాలాంటి వస్త్రాన్ని ఉపయోగిస్తారు. కాని గ్లాస్‌ క్లీనింగ్‌కి ఇది సరైన పద్దతి కాదు. ఇలా చేయడం వల్ల మీ కళ్లపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం.

టూత్‌పేస్ట్ వాడకం

గ్లాసులను శుభ్రం చేయడానికి దానిపై కొద్దిగా టూత్‌పేస్ట్ వేసి కాటన్‌ క్లాత్‌తో మెల్లగా రుద్దాలి. 30 సెకన్ల పాటు ఇలా చేయాలి. గాజుపై ఉన్న గీతలు కూడా క్లీన్ అవుతాయి.

షేవింగ్ ఫోమ్

గ్లాసులను శుభ్రం చేయడానికి ముందుగా గ్లాస్‌పై షేవింగ్ ఫోమ్‌ను అప్లై చేసి కాసేపు అలాగే ఉంచాలి. నురుగును కొంత సమయం పాటు ఉంచడం వల్ల గ్లాస్‌పై ఉన్న దుమ్ము, ధూళి క్లీన్ అవుతుంది. కొంత సమయం తరువాత నురుగును కాటన్ క్లాత్‌తో శుభ్రం చేస్తే క్లీన్‌గా ఉంటుంది.

లిక్విడ్ గ్లాస్ క్లీనర్

గ్లాసులను శుభ్రం చేయడానికి లిక్విడ్ గ్లాస్ క్లీనర్ సులభమైన మార్గం. ఇందులో ఆల్కహాల్ ఉంటుంది ఇది గాజును శుభ్రపరచడంతో పాటు హ్యాండ్ శానిటైజర్‌గా పనిచేస్తుంది. దీంతో అద్దాలతో పాటు చేతులు కూడా శుభ్రం చేసుకోవచ్చు.

ఈ తప్పులు చేయకండి

గ్లాసులపై మరకలను శుభ్రం చేయడానికి సబ్బు లేదా డిటర్జెంట్‌లని వాడకండి. ఈ అలవాటు మీ అద్దాలను దెబ్బతీస్తుంది. వాస్తవానికి చాలా డిటర్జెంట్లు గట్టిగా, పొడిగా ఉంటాయి. ఇది అద్దాల సున్నితత్వాన్ని పాడు చేస్తుంది. అద్దాలు శుభ్రం చేయడానికి కాటన్ క్లాత్ మాత్రమే ఉపయోగించాలి. కళ్లకు హాని కలిగించే గ్లాసులను శుభ్రం చేయడానికి చాలా మంది బేకింగ్ సోడాను ఉపయోగిస్తారు.

Covid 19: కొవిడ్‌ నెగటివ్‌ తర్వాత కూడా ఇన్ఫెక్షన్.. లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు ఎలా ఉంటాయంటే..?

Women: మహిళలకు గమనిక.. డెలివరీ తర్వాత కెరీర్ కొనసాగాలంటే ఇవి తప్పనిసరి..

IPL 2022 వేలానికి ముందు తుఫాన్‌ సెంచరీ.. 57 బంతుల్లో 116 పరుగులు.. ఎవరో తెలుసా..?