Headache: కొవిడ్ తగ్గినా తలనొప్పి తగ్గడం లేదా.. టాబ్లెట్స్ కన్నా ఈ ఆయుర్వేదం బెస్ట్..?
Headache: కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. వైరస్ వల్ల కోట్లాది మంది అనారోగ్యానికి గురయ్యారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు ల్పోయారు. కరోనాతో యుద్ధంలో గెలిచి మళ్లీ తమ
Headache: కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. వైరస్ వల్ల కోట్లాది మంది అనారోగ్యానికి గురయ్యారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు ల్పోయారు. కరోనాతో యుద్ధంలో గెలిచి మళ్లీ తమ జీవితాన్ని గడపాలని ప్రయత్నిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఇందులో ఇప్పటికి చాలామంది కొవిడ్ లక్షణాలను అనుభవిస్తున్నారు. అయితే చాలామంది తలనొప్పితో బాధపడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. మల్టీవిటమిన్ల వినియోగం ఉన్నప్పటికీ తలనొప్పి వదలడం లేదు. ఇటువంటి ధీర్ఘ కాలిక సమస్యకి మందులు, టాబ్లెట్లు కరెక్ట్ కాదు. ఆయుర్వేద, హోమ్ రెమిడిస్ బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.
1. తులసి టీ
తులసి టీ తాగడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. తులసి ఆకులు ఒక రకమైన సహజ నివారణిగా భావిస్తారు. ఇది కండరాలను శాంతపరుస్తుంది. ఒక కప్పు నీటిలో కొన్ని తులసి ఆకులను వేసి మరిగించాలి. ఈ టీని నెమ్మదిగా తాగాలి. మీకు కావాలంటే కొంచెం తేనెను కూడా కలుపుకోవచ్చు.
2. పుదీనా టీ
పుదీనాలో అనాల్జేసిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి తలనొప్పిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కొన్ని పుదీనా ఆకులను తీసుకుని దాని రసాన్ని తీసి నుదుటిపై రాసుకుంటే మంచిది. కొన్ని నిమిషాల్లో ఉపశమనం లభిస్తుంది. పుదీనా టీని కూడా తాగవచ్చు.
3. ఆవిరి తీసుకోండి
తలనొప్పి మాత్రమే కాదు జలుబు వంటి సమస్యలను ఆవిరితో దూరం చేసుకోవచ్చు. దీని కోసం అల్లం పొడిని తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు ఆ అల్లం నీటి ఆవిరిని దుప్పటి కప్పుకొని బాగా పీల్చాలి. ఆవిరి తీసుకునేటప్పుడు ముఖం వేడి నీటికి దగ్గరగా ఉండకూడదని గుర్తుంచుకోండి. ఇది చర్మంపై చెడు ప్రభావం చూపుతుంది.
4. అల్లం నుంచి ఉపశమనం
తలనొప్పి నుంచి ఉపశమనం పొందడంలో అల్లం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక చెంచా అల్లం పొడిని తీసుకుని రెండు చెంచాల నీళ్లను కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్ ను నుదుటిపై కొన్ని నిమిషాల పాటు రాయాలి. ఇది తలనొప్పి మందులా పనిచేసి మంచి ఉపశమనం కలిగిస్తుంది.