AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాహనదారులకు గమనిక.. కారు వెనుక సీటు మధ్యలో కూర్చునే వారికి కూడా సీట్‌బెల్ట్‌..?

Three Point Seat Belt: వాహనదారులకు గమనిక. త్వరలో ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకురానుంది. ఇకనుంచి కారు వెనుకసీటు మధ్యలో కూర్చున్న వ్యక్తి కూడా సీటు బెల్ట్‌ ధరించాల్సి ఉంటుంది.

వాహనదారులకు గమనిక.. కారు వెనుక సీటు మధ్యలో కూర్చునే వారికి కూడా సీట్‌బెల్ట్‌..?
Car Seat Belt
uppula Raju
|

Updated on: Feb 08, 2022 | 12:03 PM

Share

Three Point Seat Belt: వాహనదారులకు గమనిక. త్వరలో ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకురానుంది. ఇకనుంచి కారు వెనుకసీటు మధ్యలో కూర్చున్న వ్యక్తి కూడా సీటు బెల్ట్‌ ధరించాల్సి ఉంటుంది. దీంతో పాటు కార్ల తయారీదారులు ఇకపై అన్ని సీట్లలో 3-పాయింట్ సీట్ బెల్ట్‌ను ఉపయోగించాలి. సీటు మధ్యలో కూర్చున్న వ్యక్తికి సరిపడేలా సీటు బెల్టు ఉండాలని చెప్పింది. ప్రస్తుతం కారులో ముందు సీటులో ఇద్దరు, వెనుక సీటులో ఇద్దరు సీటు బెల్ట్ ధరించవచ్చు. వెనుక సీటు మధ్యలో కూర్చున్న వ్యక్తికి సీటు బెల్ట్ లేదు. ప్రభుత్వం వీరు కూడా సీటుబెల్ట్‌ ధరించాలని సూచిస్తోది.

ప్రస్తుతం చాలా కార్లు 2 పాయింట్ల సీట్ బెల్ట్‌ను మాత్రమే ఉపయోగిస్తున్నాయి. ఇక నుంచి వై-ఆకారపు సీట్‌బెల్ట్‌ను అన్ని సీట్లలో తప్పనిసరిగా అమర్చాలి. విమానంలో ఉండే సీటు బెల్ట్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలి. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ “భారతదేశంలో తయారు చేసే కారు సురక్షితమైన, మెరుగ్గా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. చాలా కంపెనీలు తయారు చేసే కార్లలో 3 పాయింట్ల సీట్ బెల్ట్ ఉండటం లేదు. కేవలం 2 పాయింట్ల సీటు బెల్ట్ మాత్రమే ఉంటుంది వెనుక సీటులో ఉన్నవారికి సీట్ బెల్ట్ ఉండటం లేదు. దీనివల్ల ప్రమాదం జరిగినప్పుడు 2 పాయింట్ల సీటు బెల్టులు ధరించే వారికి ఎక్కువ నష్టం జరుగుతుంది. ప్రాణనష్టం సంభవించవచ్చు. దీనిని నివారించడానికి ప్రభుత్వం 3-పాయింట్ లేదా Y- ఆకారపు సీట్ బెల్ట్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

2 పాయింట్ల సీటు బెల్ట్ కంటే 3 పాయింట్ల సీటు బెల్ట్ సురక్షితమైనదని శాస్త్రీయంగా నిరూపించారు. 3 పాయింట్ల సీట్ బెల్ట్ ధరించినప్పుడు శరీరాన్ని పూర్తిగా కదలకుండా బెల్ట్ పట్టుకుని భుజాన్ని అలాగే ఉంచుతుంది. అందువల్ల ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి గాయాలు కాకుండా ఉంటుంది. 1959లో వోల్వో తన వాహనాలకు 3 పాయింట్ల సీట్ బెల్ట్‌లను ప్రవేశపెట్టి పేటెంట్ పొందింది. కారు భద్రతపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం ఇది రెండోసారి. దీనికి ముందు కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేసింది.

IPL 2022: విరాట్‌ కోహ్లీ పెద్ద విషయం వెల్లడించాడు.. వేలంలోకి రాకపోవడానికి అదే కారణమట..?

Crime News: గంగదేవిపల్లిలో నిజంగానే బంగారం దొరికిందా.. గుప్తనిధుల స్టోరీ ఏంటి..?

Covid 19: కొవిడ్‌ నెగటివ్‌ తర్వాత కూడా ఇన్ఫెక్షన్.. లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు ఎలా ఉంటాయంటే..?