Crime News: గంగదేవిపల్లిలో నిజంగానే బంగారం దొరికిందా.. గుప్తనిధుల స్టోరీ ఏంటి..?

Crime News: వరంగల్‌ జిల్లాలో ఇప్పుడు ఏ నోట విన్నా గంగదేవిపల్లి గుప్తనిధుల విషయమే మాట్లాడుకుంటున్నారు. ఆదివారం రాగి నాణేలను విక్రయించేందుకు వెళ్తుండగా టాస్క్‌ఫోర్సు

Crime News: గంగదేవిపల్లిలో నిజంగానే బంగారం దొరికిందా.. గుప్తనిధుల స్టోరీ ఏంటి..?
Gold Coins
Follow us
uppula Raju

|

Updated on: Feb 08, 2022 | 10:45 AM

Crime News: వరంగల్‌ జిల్లాలో ఇప్పుడు ఏ నోట విన్నా గంగదేవిపల్లి గుప్తనిధుల విషయమే మాట్లాడుకుంటున్నారు. ఆదివారం రాగి నాణేలను విక్రయించేందుకు వెళ్తుండగా టాస్క్‌ఫోర్సు పోలీసులు కొంతమందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 30 రాగి నాణెలతో పాటు ఓ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఓ ఆడియో టేప్ కూడా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే గంగదేవిపల్లిలో నిజంగానే గుప్తనిధులు దొరికాయా..? దీని వెనకున్న స్టోరీ ఏంటి.. తదితర విషయాలు తెలుసుకుందాం.

వాస్తవానికి గంగదేవిపల్లికి చెందిన యార మల్లారెడ్డికి స‌ర్వే నెంబ‌ర్ 375లో 1.8 ఎకరాల భూమి ఉంది. ఇందులో గుప్త నిధులు ఉన్నట్లుగా కనుగొన్నాడు. అధికారులకు ఎటువంటి సమాచారం అందించలేదు. ఈ నెల 23న అదే గ్రామానికే చెందిన‌ పంజ‌ర‌బోయిన శ్రీనివాస్‌, మేడిద కృష్ణ, యాట పూర్ణచందర్‌లతో కలిసి త‌వ్వకాలు జ‌రిపాడు. ఈ త‌వ్వకాల్లో 1818 నాటి 30 పాత రాగి నాణేలను బయటపడ్డాయి. తర్వాత మహేష్ సహాయంతో హైదరాబాద్‌లో వాటిని విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

అయితే త‌వ్వకాల్లో పెద్ద ఎత్తున బంగారం ల‌భ్యమైన‌ట్లుగా గ్రామ‌స్థుల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతోంది. రాగి నాణెల‌తో పాటు దాదాపు 1000 బంగారు నాణెలు ల‌భ్యమైనట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విష‌యం ఓ ఇద్దరు పెద్ద లీడ‌ర్లకు తెలియ‌డంతో విష‌యం ఆరా తీసి వాటాలు కోరుతున్నట్లుగా నియోజ‌క‌వ‌ర్గంలో ప్రచారం కూడా జ‌రుగుతోంది. నిందితులను ఈ కేసు నుంచి ర‌క్షించేందుకు బేరసారాలు జరుగుతున్నట్లు గ్రామస్థులు అనుకుంటున్నారు. కానీ ఇప్పటికీ ఎన్ని బంగారు నాణేలు, ఎన్ని రాగి నాణేలు దొరికాయో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అసలు నాణేలు మాత్రమేనా బంగారం కూడా ఏమైనా దొరికిందా అనేది అధికారులే తేల్చాలి.

Hyderabad: బంజారాహిల్స్‌లో యూట్యూబర్ సరయు అరెస్ట్‌.. మహిళలని కించపరిచే షాట్‌ ఫిల్మ్‌ తీసినందుకు..?

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్‌.. వచ్చే నెలలో వడ్డీ పెరిగే అవకాశం..?

Covid 19: కొవిడ్‌ నెగటివ్‌ తర్వాత కూడా ఇన్ఫెక్షన్.. లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు ఎలా ఉంటాయంటే..?

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..