AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Magic: వణుకు పుట్టిస్తున్న క్షుద్రపూజలు.. ఇంట్లో గుంతలు తవ్వి.. పసుపు కుంకుమలు చల్లి..

సమాజంలో ఆధునికత పెరిగినప్పటికీ.. మారుమూల పల్లెలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మూఢ నమ్మకాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఏదో జరిగిపోతోంది. ఏదో రాబోతోందన్న అన్న నమ్మకాన్ని కేటుగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు....

Black Magic: వణుకు పుట్టిస్తున్న క్షుద్రపూజలు.. ఇంట్లో గుంతలు తవ్వి.. పసుపు కుంకుమలు చల్లి..
Chethabadi
Ganesh Mudavath
|

Updated on: Feb 08, 2022 | 11:14 AM

Share

సమాజంలో ఆధునికత పెరిగినప్పటికీ.. మారుమూల పల్లెలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మూఢ నమ్మకాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఏదో జరిగిపోతోంది. ఏదో రాబోతోందన్న అన్న నమ్మకాన్ని కేటుగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చిలుకూరు చెమ్నారిగూడెంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఇంట్లో గుంతలు తీసి, పసుపు, కుంకుమలతో పూజలు చేసిన దృశ్యాలు సంచలనంగా మారాయి.

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో చెమ్నారిగూడెంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఇంట్లో దోషం ఉందని, పూజలు చేయకపోతే ప్రాణ నష్టం కలుగుతుందని నమ్మించి శేషాచార్యులు అనే వ్యక్తి ఈ ఘటనలకు పాల్పడుతున్నాడు. అంతే కాకుండా ఇంట్లో బంగారం అందని, వెలికి తీస్తానని నమ్మిస్తూ మోసం చేస్తున్నాడు. ఇళ్లల్లో గుంతలు తీసి పూజలు చేస్తున్నాడు. తీరా తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు. చివరికి జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ కు ఫిర్యాదు చేసి, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

Also Read

Hyderabad: బంజారాహిల్స్‌లో యూట్యూబర్ సరయు అరెస్ట్‌.. మహిళలని కించపరిచే షాట్‌ ఫిల్మ్‌ తీసినందుకు..?

 Siddipet Firing case: జల్సాలకు బానిసై.. పోలీసులకు చిక్కి.. చివరికి.. ??

Asteroid: భూమివైపు దూసుకొస్తోన్న పెను ప్రమాదం.. నాసా తీవ్ర హెచ్చరిక.. ఎప్పుడంటే?