Hyderabad: బంజారాహిల్స్‌లో యూట్యూబర్ సరయు అరెస్ట్‌.. మహిళలని కించపరిచే షార్ట్‌ ఫిల్మ్‌ తీసినందుకు..?

Hyderabad: మహిళలని కించపరిచే విధంగా షాట్‌ ఫిల్మ్‌ తీసినందుకు యూట్యూబర్‌ సరయు, ఆమె అనుచరుల బృందాన్ని బంజరాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సరయూ ఆమె బృందం 7 ఆర్ట్స్‌

Hyderabad: బంజారాహిల్స్‌లో యూట్యూబర్ సరయు అరెస్ట్‌.. మహిళలని కించపరిచే షార్ట్‌ ఫిల్మ్‌ తీసినందుకు..?
Sarayu
Follow us
uppula Raju

|

Updated on: Feb 08, 2022 | 1:40 PM

Hyderabad: మహిళలని కించపరిచే విధంగా షార్ట్ ఫిల్మ్‌ తీసినందుకు యూట్యూబర్‌ సరయు, ఆమె అనుచరుల బృందాన్ని బంజరాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సరయూ ఆమె బృందం 7 ఆర్ట్స్‌ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది సిరిసిల్లలో ఏర్పాటు చేసే రెస్టారెంట్ కోసం సరయు, ఆమె బృందం ఓ షార్ట్ ఫిల్మ్‌ షూట్‌ చేశారు. ఇందులో మహిళలు, హిందు సమాజాన్ని కించపరిచారని రాజన్న సిరిసిల్ల జిల్లా వీహెచ్‌పీ అధ్యక్షుడు చేపూరి అశోక్‌ సిరిసిల్లలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ విషయాన్ని బంజరాహిల్స్‌ పోలీసులకు బదిలీ చేశారు.

దీంతో సోమవారం పోలీసులు ఫిలింనగర్‌లోని కార్యాలయంలో ఉన్న సరయూతోపాటు ఆమె బృంద సభ్యులైన దర్శక నిర్మాత, శ్రీకాంత్‌రెడ్డి, నటులు కార్తిక్, కృష్ణమోహన్‌లను అరెస్ట్‌ చేశారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందన్న అభియోగంపై 153a, 295a సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి బంజారాహిల్స్‌ పోలీసు ఠాణాకు తరలించారు. నిన్న గంటన్నర విచారణ చేసిన పోలీసులు మంగళవారం కూడా విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. సిరిసిల్లలోని హోటల్‌ ప్రమోషన్ పాటలో సరయుతో పాటు మరికొందరు గణపతి బప్పా మోరియా బ్యాండ్‌ను తలకు ధరించి మద్యం తాగారని అశోక్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. దేవుడి బొమ్మలు ధరించి, లిక్కర్ సేవించి హోటల్‌ను సందర్శిస్తారనే సంకేతాన్ని ఆ ప్రమోషన్ సాంగ్‌లో ఉందని చెప్పారు. హిందువుల మనోభావాలను కించపరినందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్‌.. వచ్చే నెలలో వడ్డీ పెరిగే అవకాశం..?

Covid 19: కొవిడ్‌ నెగటివ్‌ తర్వాత కూడా ఇన్ఫెక్షన్.. లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు ఎలా ఉంటాయంటే..?

IPL 2022 వేలానికి ముందు తుఫాన్‌ సెంచరీ.. 57 బంతుల్లో 116 పరుగులు.. ఎవరో తెలుసా..?