AP Crime news: రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం.. ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా

ఈత(Swimming) సరదా రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సరదాగా స్నేహితులతో కలిసి ఈత నేర్చుకునేందుకు వెళ్లిన యువకుల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు...

AP Crime news: రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం.. ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా
Swimming Death
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 08, 2022 | 11:18 AM

ఈత(Swimming) సరదా రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సరదాగా స్నేహితులతో కలిసి ఈత నేర్చుకునేందుకు వెళ్లిన యువకుల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయారు. ఊహించని ఈ ఘటనతో మృతుల తల్లిదండ్రులు బోరున విలపించారు. కృష్ణా జిల్లా ముసునూరు(Musunuru) మండలం లోపూడి గ్రామానికి చెందిన ఆకుల రాజశేఖర్‌, పాకనాటి రాంబాబు తమ స్నేహితులు మహేష్‌బాబు, రామకృష్ణ, నితీష్‌ కుమార్‌, గోపిలతో కలిసి ఈత నేర్చుకునేందుకు సమీపంలోని తమ్మిలేరు చెక్‌ డ్యాంకు వెళ్లారు.ఈత నేర్చుకుంటున్న సమయంలో రాజశేఖర్‌, రాంబాబులు చెక్‌ డ్యాంలోని లోతైన గుంత వద్దకు చేరుకున్నారు. ఈత రాకపోవడంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. అప్రమత్తమైన స్నేహితులు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే వారు మృతి చెందారు. గ్రామస్థులు చెక్ డ్యాం వద్దకు చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు.

హరిబాబు దంపతులకు రాజశేఖర్‌ ఒక్కడే కుమారుడు. రాజశేఖర్‌ ఇంటర్‌ చదివి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. తల్లి ఏడాదిన్నర క్రితం కొవిడ్‌తో మరణించింది. ఈ సమయంలో ఊహించని ఘటనలో కుమారుడ రాజేశేఖర్ ను కోల్పోయి.. ఒంటరిగా మిగిలాడు. మరోవైపు రాంబాబు తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. తల్లి పుష్ప కూలీ పనులు చేస్తూ పిల్లల్ని చదివిస్తోంది. రాంబాబు నూజివీడు సారథి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. చేతికి అందివచ్చిన కొడుకు అకాల మరణంతో ఆ తల్లి రోదించిన తీరు కంటతడి పెట్టించింది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!