EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో వడ్డీ పెరిగే అవకాశం..?
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు త్వరలో శుభవార్త అందబోతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశం వచ్చే నెలలో గౌహతిలో జరుగుతుంది.
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు త్వరలో శుభవార్త అందబోతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశం వచ్చే నెలలో గౌహతిలో జరుగుతుంది. ఈ సమావేశంలో 2021-22కి సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ (PF) డిపాజిట్ల వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకోవచ్చు. రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ మునుపటి సంవత్సరం 2020-21కి 8.5 శాతం వడ్డీని ఇచ్చింది. ఈపీఎఫ్‌వో ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఆడిట్ కమిటీ బుధవారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఇప్పటివరకు జరిగిన ఈపీఎఫ్‌వో ఆదాయాలపై చర్చించే అవకాశం ఉంది. దీని ఆధారంగా వడ్డీ రేటును CBTకి సిఫార్సు చేస్తుంది. గత ఏడాది మార్చిలో శ్రీనగర్‌లో జరిగిన సమావేశంలో CBT 2020-21కి EPF డిపాజిట్లపై సంవత్సరానికి 8.5 శాతం వడ్డీ రేటును సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదం తెలిపింది. EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల CBT సమావేశం గత ఏడాది నవంబర్‌లో జరిగింది. అప్పుడు EPS పెంచడంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇంతకు ముందు వడ్డీ రేటు ఎంత
ప్రస్తుతం పీఎఫ్‌లో డిపాజిట్ చేసిన సొమ్ముపై 8.5 శాతం వడ్డీ ఇస్తోంది. అయితే ఇది మునుపటి వడ్డీ రేట్ల కంటే తక్కువ. 2019-20కి వడ్డీ రేటు 8.5 శాతంగా నిర్ణయించారు. ఇది గత 7 సంవత్సరాలలో అతి తక్కువ. 2018-19లో పీఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతం. 2016-17 సంవత్సరంలో EPFO సభ్యులకు 8.65 శాతం వడ్డీని ఇచ్చింది. 2017-18లో ఈ రేటు 8.55 శాతానికి తగ్గింది. 2013-14లో, EPFO తన సభ్యులకు PF డిపాజిట్లపై 8.75 శాతం వడ్డీని ఇచ్చింది. 2014-15లో కూడా ఇదే రేటు ఉండగా, 2012-13లో పీఎఫ్ వడ్డీ రేటు 8.5 శాతానికి తగ్గింది. 2011-12లో పీఎఫ్ రేటు 8.25 శాతం. ఈ విధంగా పీఎఫ్‌పై వచ్చే వడ్డీ హెచ్చుతగ్గులకు లోనవుతూ ప్రస్తుతం 8.5 శాతానికి చేరుకుంది.
pf బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి
EPF సభ్యులు SMS ద్వారా బ్యాలెన్స్ ఎంతో చెక్ చేసుకోవచ్చు. కేవలం ‘EPFOHO UAN LAN’ అని టైప్ చేసి వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కి ఎస్సెమ్మెస్ పంపాలి. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. దీన్ని చేయడానికి EPF సభ్యుడు 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.