Siddipet Firing case: జల్సాలకు బానిసై.. పోలీసులకు చిక్కి.. చివరికి.. ??

తెలంగాణలోని సిద్దిపేట(siddipet) సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సమీపంలో జరిగిన కాల్పులు, దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. జల్సాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో...

 Siddipet Firing case: జల్సాలకు బానిసై.. పోలీసులకు చిక్కి.. చివరికి.. ??
Siddipeta Firing
Follow us

|

Updated on: Feb 08, 2022 | 7:21 AM

తెలంగాణలోని సిద్దిపేట(siddipet) సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సమీపంలో జరిగిన కాల్పులు, దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. జల్సాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో తేలింది. రూ.43.50 లక్షలు దోచుకెళ్లిన ఈ ఘటనపై సిద్దిపేట పోలీసు కమిషనర్‌ ఎన్‌.శ్వేత 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు విచారణ ముమ్మరం చేసిన పోలీసులు.. నలుగురు నిందితులను అరెస్ట్‌(Arrest) చేసి రిమాండ్‌కు పంపించారు. వీరి నుంచి రూ.34 లక్షలు నగదు, మూడు వాహనాలు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

సిద్దిపేట పట్టణానికి చెందిన వ్యాపారి వకులాభరణం నర్సయ్య.. తన ప్లాట్‌ను శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తికి విక్రయించాడు. రిజిస్ట్రేషన్‌ చేయడానికి జనవరి 31న సిద్దిపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చారు. ప్లాట్‌ కొనుగోలుదారుడు చెల్లించిన రూ.43.50 లక్షల నగదు బ్యాగును నర్సయ్య తన కారు డ్రైవర్‌కు ఇచ్చి కార్యాలయంలోనికి వెళ్లాడు. ఈ సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గన్‌తో డ్రైవర్‌పై కాల్పులు జరిపి డబ్బు ఉన్న సంచిని ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆదివారం ఎడమ సాయికుమార్‌ ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో ముగ్గురు ముగ్గురు నిందితులు గజ్జె రాజు, బలిపురం కరుణాకర్‌, బిగుళ్ల వంశీకృష్ణ లను కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులకు గన్ ఎలా వచ్చింది, తుపాకీని వారు ఎక్కడ, ఎప్పుడు కొనుగోలు చేశారు..ఈ కేసులో ప్లాటు క్రయ విక్రయదారుల ప్రమేయం ఉందా? లేదా ? అనే విషయాలపై దర్యాప్తు చేపట్టారు.

Also Read

CDAC Recruitment: సాఫ్ట్‌వేర్‌ రంగంలో అనుభవంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాలు..

Job Mela: నేడు హైదరాబాద్‌లో మెగా జాబ్‌ మేళా.. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్న వారికి కూడా ఛాన్స్‌..

Tribal University: ఆర్థిక శాఖ పరిశీలనలో గిరిజన విశ్వవిద్యాలయం.. ఏర్పాటుపై కేంద్రం మరోసారి క్లారిటీ..