CDAC Recruitment: సాఫ్ట్‌వేర్‌ రంగంలో అనుభవంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాలు..

CDAC Recruitment: సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింట్‌ (సీ-డ్యాక్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో అనుభవం ఉన్న వారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వ..

CDAC Recruitment: సాఫ్ట్‌వేర్‌ రంగంలో అనుభవంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాలు..
Follow us

|

Updated on: Feb 08, 2022 | 7:09 AM

CDAC Recruitment: సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింట్‌ (సీ-డ్యాక్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో అనుభవం ఉన్న వారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థ అసోంలోని సిల్చార్‌ క్యాంపస్‌లో ఉన్న ఖాళీలను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనుంది. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 37 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు.

* వీటిలో ప్రాజెక్ట్‌ మేజేర్‌ (02), ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ (09), ప్రాజెక్ట్‌ టెక్నీషియన్లు (04), ప్రాజెక్ట్‌ లీడర్లు (02), ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు (03), ప్రాజెక్ట్‌ సపోర్ట్‌ స్టాఫ్‌ (06), ప్రాజెక్ట్‌ అసోసియేట్లు (11) ఖాళీలు ఉన్నాయి.

* సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, మొబైల్‌ అప్లికేషన్‌ డెవలపర్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్‌/ఎంటెక్‌/ఎంఈ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత అనుభవం తప్పనిసరి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 28 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

* దరఖాస్తులను hrd-sil@cdac.in ఐడీకి పంపించాలి.

* అభ్యర్థులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 07-02-2022న ప్రారంభంకాగా, 28-02-2022తో మగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడి.

Also Read: Big News Big Debate: టీఆర్ఎస్‌ – బీజేపీ మధ్య ముదిరిన వివాదాలు.. విగ్రహాలపై ఏమిటీ రాజకీయ ఆగ్రహం..

Statue of Equality: రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం.. సహస్రాబ్ధి ఉత్సవాల్లో సీఎం జగన్..

Health Tips: చెప్పులు లేకుండా వాకింగ్ చేయడం మంచిదేనా? దాని వలన ఉపయోగం ఉంటుందా? తెలుసుకోండి!