Realme c35: రియల్‌మీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేల లోపే అదిరిపోయే ఫీచర్లు..

Realme c35: రియల్‌మీ మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. రియల్‌మీ సీ 35 పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్‌ త్వరలోనే భారత్‌లా లాంచ్‌ కానుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ ఫీచర్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి...

Narender Vaitla

|

Updated on: Feb 08, 2022 | 8:39 AM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. రియల్‌మీ సీ35 పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్‌ ఫీచర్లు ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

1 / 5
ఈ ఫోన్‌ను తొలుత థాయ్‌లాండ్‌లో ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నారు. ఆ తర్వాత చైనాతో పాటు భారత్‌లో తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే రియల్‌మీ సీ35 ఫీచర్లు ఇవేనంటూ కొన్ని లీక్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

2 / 5
ఈ లీక్స్‌ ప్రకారం ఈ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించనున్నారు. యూనిసెక్‌ టీ 616 ఎస్‌వోసీ ప్రాసెసర్‌ ఈ ఫోన్‌ సొంతం. ఈ ఫోన్‌ 4జీబీ ర్యామ్‌+64 జీబీ స్టోరేజ్‌, 4జీబీ ర్యామ్‌+128 జీబీ ర్యామ్‌తో రానుంది.

3 / 5
కెమెరా అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా ఇవ్వనున్నారు. ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పని చేయనుంది.

4 / 5
ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ మన కరెన్సీలో రూ. 13వేలకు పైగా ఉండనున్నట్లు సమాచారం. ఇక ఈ ఫోన్‌లో 18 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్ సపోర్ట్‌ చేసే, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇవ్వనున్నారు.

5 / 5
Follow us