Cigarette: సిగరెట్ మానేసిన రెండో రోజు నుంచే మార్పులు.. 3 నుంచి 6 వారాల్లో ఎంత తేడా అంటే..?

Cigarette: సిగరెట్ కాల్చడం ఆరోగ్యానికి హానికరం. ఇది ఊపిరితిత్తులతో సహా శరీరంలోని అనేక భాగాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. సిగరెట్ కాల్చేవారు తరచుగా అనారోగ్యానికి గురవుతారు.

Cigarette: సిగరెట్ మానేసిన రెండో రోజు నుంచే మార్పులు.. 3 నుంచి 6 వారాల్లో ఎంత తేడా అంటే..?
Quit Smoking
Follow us
uppula Raju

|

Updated on: Feb 08, 2022 | 1:01 PM

Cigarette: సిగరెట్ కాల్చడం ఆరోగ్యానికి హానికరం. ఇది ఊపిరితిత్తులతో సహా శరీరంలోని అనేక భాగాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. సిగరెట్ కాల్చేవారు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. అయినా కూడా ఈ అలవాటును చాలామంది వదులుకోలేకపోతున్నారు. కొంతమంది ఒకట్రెండు రోజులు మానేస్తారు. టెంప్ట్ అయినప్పుడు మళ్లీ కాల్చుతారు. కానీ మీరు బలమైన నిర్ణయం తీసుకుంటే సిగరెట్లు మానేయడం పెద్ద కష్టమేమి కాదు. సిగరెట్ మానేసినప్పుడు రోజు రోజుకి శరీరంలో ఏం జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం.

పొగతాగడం పూర్తిగా మానేసినప్పుడు అతని శరీరంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఉదాహరణకు, సిగరెట్ మానేసిన 8 గంటల తర్వాత రక్తంలో నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ పరిమాణం తగ్గుతుంది. కార్బన్ మోనాక్సైడ్ రక్తం నుంచి ఆక్సిజన్‌ను తొలగిస్తుంది. ఈ కారణంగా సిగరెట్ తాగేవారికి కండరాలు, మెదడుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. 8 గంటల తర్వాత మీరు సిగరెట్ తాగడానికి చాలా కోరికను కలిగి ఉంటారు ఒక సమయంలో 5-10 నిమిషాల పాటు ఆగలేకపోతారు. కానీ అలాంటి పరిస్థితిలో మీరు చూయింగ్ గమ్ వాటి సాయం తీసుకుంటే మంచిది.

సిగరెట్ మానేసిన12 గంటల తర్వాత శరీరంలో కార్బన్ మోనాక్సైడ్ స్థాయి సాధారణ స్థితికి రావడం ప్రారంభమవుతుంది. మీ గుండె చాలా విశ్రాంతి పొందుతుంది. ఆక్సిజన్ కోసం కష్టపడాల్సిన అవసరం ఉండదు. సిగరెట్ మానేసి 24 గంటలు అయితే క్రమంగా మీరు సాధారణ వ్యక్తుల వర్గంలోకి వెళుతారు. 48 గంటల తర్వాత వాసన చూసే సామర్థ్యం మెరుగవుతుంది. నరాలు కోలుకోవడం జరుగుతుంది. రుచి, వాసన భావాలు తీవ్రమవుతాయి. మీ శరీరంలో శుభ్రపరిచే పని మొదలవుతుంది. ఊపిరితిత్తుల నుంచి శ్లేష్మం మొదలైనవి రావడం మొదలవుతాయి. నికోటిన్ కూడా పోతుంది. ఈ సమయంలో విశ్రాంతి లేకపోవటం, కళ్లు తిరగడం, ఆకలిగా లేదా అలసటగా అనిపించడం సర్వసాధారణం. చాలా మందికి తీవ్రమైన తలనొప్పి కూడా ఉంటుంది. కానీ క్రమంగా పరిస్థితి సాధారణ స్థితికి రావడం ప్రారంభమవుతుంది.

2 వారాల నుంచి 3 నెలల తర్వాత మీ ఊపిరితిత్తులు మునుపటి కంటే స్పష్టంగా బలంగా మారుతాయి. మీ రక్త ప్రసరణ మెరుగవుతుంది వ్యాయామం చేయగలుగుతారు. సిగరెట్ మానేసిన 3 నుంచి 6 నెలలలోపు సులభంగా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తారు. మీ శక్తి పెరగడం ప్రారంభమవుతుంది జలుబు, ఇతర వ్యాధులను తగ్గించడంలో సహాయం లభిస్తుంది. ఒక సంవత్సరం తర్వాత గుండె జబ్బులు వచ్చే ప్రమాదం సగానికి పైగా తగ్గిపోతుంది.

Headache: కొవిడ్‌ తగ్గినా తలనొప్పి తగ్గడం లేదా.. టాబ్లెట్స్‌ కన్నా ఈ ఆయుర్వేదం బెస్ట్..?

వాహనదారులకు గమనిక.. కారు వెనుక సీటు మధ్యలో కూర్చునే వారికి కూడా సీట్‌బెల్ట్‌..?

IPL 2022: విరాట్‌ కోహ్లీ పెద్ద విషయం వెల్లడించాడు.. వేలంలోకి రాకపోవడానికి అదే కారణమట..?