AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flax Seed Oil: ఈ నూనె ఉపయోగించారంటే.. దీర్ఘకాలిక వ్యాధులకు చెక్!

ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. క్యాన్సర్, డయాబెటీస్, బీపీ, గుండె జబ్బులు, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి. కేవలం పెద్దవారే కాకుండా చిన్న వయసు కలిగిన వారిలో కూడా ఈ సమస్యలు ఎక్కుగానే కనిపిస్తున్నాయి. ఇందుకు ముఖ్య కారణం మారిన ఆహారపు అలవాట్లు. ఆహారాల అలవాట్ల కారణంగా కూడా దీర్ఘకాలిక వ్యాధులు అనేవి ఎటాక్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఆయిల్‌తో చేసిన ఆహారాలను ఎక్కువగా..

Flax Seed Oil: ఈ నూనె ఉపయోగించారంటే.. దీర్ఘకాలిక వ్యాధులకు చెక్!
Flax Seed Oil
Chinni Enni
|

Updated on: Oct 13, 2024 | 6:26 PM

Share

ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. క్యాన్సర్, డయాబెటీస్, బీపీ, గుండె జబ్బులు, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి. కేవలం పెద్దవారే కాకుండా చిన్న వయసు కలిగిన వారిలో కూడా ఈ సమస్యలు ఎక్కుగానే కనిపిస్తున్నాయి. ఇందుకు ముఖ్య కారణం మారిన ఆహారపు అలవాట్లు. ఆహారాల అలవాట్ల కారణంగా కూడా దీర్ఘకాలిక వ్యాధులు అనేవి ఎటాక్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఆయిల్‌తో చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. కొన్ని రకాల ఆయిల్స్ ఉపయోగించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కానీ ఇప్పుడు చెప్పే నూనె ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్యలు రాకపోగా.. ఆరోగ్యంగా ఉంటారు. అవిసె గింజలతో చేసిన ఆయిల్ ఉపయోగించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. మరి అవిసె గింజల నూనె ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయో ఇప్పుడు చూద్దాం.

చర్మ ఆరోగ్యం:

మీరు అందంగా కనిపించాలంటే వంటల్లో అవిసె గింజల నూనెను ఉపయోగించండి. ముడతలు, మొటిమలు, మచ్చలు, సన్నని గీతలు, వృద్ధాప్య ఛాయలు ఉండవు. చర్మం సాఫ్ట్‌గా, కాంతివంతంగా తయారవుతుంది. పచ్చిగా కూడా ఈ నూనె తాగవచ్చు.

మంచి కొవ్వులు:

అవిసె గింజల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభ్యవుతాయి. కాబట్టి శరీరంలో పేరుకు పోయిన కొవ్వు అనేది కరిగిపోతుంది. కొవ్వు లేకపోవడం వల్ల అధిక బరువు, గుండె సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. శరీరంలో వచ్చే ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

గుండె ఆరోగ్యం:

అవిసె గింజల ఆయిల్ తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. అవిసె గింజల నూనెను ఆహారంలో చేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది రక్త నాళాల్లో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడం ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తుంది. ఈ క్రమంలోనే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

డయాబెటీస్:

ఆహారంలో అవిసె గింజలో ఆయిల్‌ను యూజ్ చేయడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది.

కడుపు శుద్ధి:

అవిసె గింజల ఆయిల్ తీసుకోవడం వల్ల కడుపు శుద్ధి అవుతుంది. పొట్టలో ఉండే మలినాలు, విష పదార్థాలు బయటకు పోతాయి. గ్యాస్, అజీర్తి, అల్సర్, మలబద్ధకం సమస్యలు తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?