మీరు మైదాతో చేసిన బ్రెడ్ కూడా తినవచ్చు. ఇది ఎక్కువగా ప్రాసెస్ అవుతుంది. ఇది గోధుమలతో తయారు చేచేసినప్పటికీ.. ఎక్కువగా పాలిష్ చేస్తారు.. ఊక లేకుండా మెత్తగా మిల్లింగ్ చేసి, శుద్ధి చేసి, బ్లీచ్ చేస్తారు. ఇది కేక్ పిండిని పోలి ఉంటుంది. దీనిలో రసయానాలను కూడా జోడిస్తారు. అయితే.. బ్రౌన్ బ్రెడ్ కంటే ఇది తక్కువ పోషకాహారాన్ని కలిగి ఉంటుంది. బ్రౌన్ బ్రెడ్‌లో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఇ, శరీరానికి మేలు చేసే కొన్ని కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. అందుకే.. మైదాతో చేసిన బ్రెడ్ కంటే.. బ్రౌన్ బ్రెడ్ మంచిదని పేర్కొంటారు.