యాపిల్ ఐప్యాడ్.. సాధారణంగా యాపిల్ ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందుబాటులో ఉండవు. కానీ ఈ పదో జనరేషన్ యాపిల్ ఐప్యాడ్ పై భారీ డిస్కౌంట్ ను అమెజాన్ అందిస్తోంది. దీనిలో లిక్విడ్ రెటీనా డిస్ ప్లే 10.9 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. ఇది 10 గంటల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. దీనిలో ఏ14 బయానిక్ చిప్, 6-కోర్ సీపీయూ, 4 కోర్ జీపీయూ, 16 కోర్ న్యూరల్ ఇంజిన్ ఉంటుంది. దీనిపై అమెజాన్లో 31శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని సాయంతో ఈ ట్యాబ్లెట్ ను మీరు రూ. 30,999కే కొనుగోలు చేయొచ్చు.