Beauty Tips : ముఖంపై నల్లటి మొటిమల మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా..! అయితే తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తొలగించుకోండి..
Beauty Tips : చర్మంపై నల్లటి మొటిమల మచ్చలు ఉండటం వల్ల చాలామంది అందవికారంగా కనిపిస్తారు. వాటిని వదిలించుకోవడానికి
Beauty Tips : చర్మంపై నల్లటి మొటిమల మచ్చలు ఉండటం వల్ల చాలామంది అందవికారంగా కనిపిస్తారు. వాటిని వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా మార్కెట్లలో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నింటిని వాడుతారు. ఎటువంటి ఫలితం ఉండదని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. అంతేకాదు అవి వాడటం వల్ల ముఖం మరింత జిడ్డుగా తయారవుతుంది. మొటిమల మచ్చలు తొలగిపోవాలంటే చాలా సమయం పడుతుందని అందరికి తెలుసు. అయితే వీటికి ఇంట్లో పాటించే చిట్కాలే చక్కగా పనిచేస్తాయి. అది ఎలాగో తెలుసుకుందాం.
తేనె, దాల్చినచెక్క మొటిమల బారిన చర్మంపై గొప్పగా పనిచేస్తాయి. మొటిమల ప్రభావాలను తగ్గిస్తాయి.
1. ఒక గిన్నెలో అర టీస్పూన్ దాల్చినచెక్క తీసుకొని అందులో సమానమైన తేనె కలపాలి. 2. దీన్ని బాగా కలపి మీ మొటిమల మచ్చలపై రాత్రిపూట చికిత్సగా వాడండి. 3. చక్కటి ఫలితాల కోసం కనీసం 30 రోజులు మీ చర్మంపై వాడండి.
కలబంద + టీ ట్రీ ఆయిల్
టీ ట్రీ ఆయిల్ ఒక గొప్ప యాంటీ బాక్టీరియల్. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎసెన్షియల్ ఆయిల్. ఇది బ్యాక్టీరియాను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. కలబందతో కలిపినప్పుడు ఇది మచ్చలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. 1. ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్ తీసుకొని అందులో రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ కలపాలి. టీ ట్రీ ఆయిల్ సాధారణంగా చాలా సాంద్రీకృత రూపంలో ఉంటుంది. 2. ఈ మిశ్రమాన్ని మీ ముఖం మీద రాత్రి చికిత్సగా ఉపయోగించుకోండి ఉదయం కడుక్కోవాలి. 3. ఈ మిశ్రమాన్ని ఒక నెల రోజులు వాడినట్లయితే మొటిమల బాధ నుంచి విముక్తులవుతారు.