Fixed Deposits : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లించే బ్యాంకులు ఇవే..! ఎంత చెల్లిస్తాయో తెలుసా..
Fixed Deposits : భారతీయ పౌరులు పొదుపును ఎక్కువగా ఇష్టపడుతారు. అందుకోసం రకరకాల మార్గాలను వెతుకుతారు.
Fixed Deposits : భారతీయ పౌరులు పొదుపును ఎక్కువగా ఇష్టపడుతారు. అందుకోసం రకరకాల మార్గాలను వెతుకుతారు. తమ డబ్బులు ఎక్కడ పెట్టుబడిపెడితే భద్రంగా ఉంటాయో ఆరా తీస్తూ ఉంటారు. చాలామంది బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్ మంచి ఎంపికగా పరిగణిస్తారు. ఎందుకుంటే ప్రభుత్వ నుంచి సెక్యూరిటీ, మంచి రాబడి వస్తోందని నమ్ముతారు. అయితే అన్ని బ్యాంకులు వడ్డీలు ఒకే విధంగా చెల్లించవు. కొన్ని బ్యాంకులు అధికంగా వడ్డీ చెల్లిస్తాయి. ఆ బ్యాంకులు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం.
మార్కెట్ పరంగా చూస్తే పెద్దబ్యాంకుల కంటే చిన్న బ్యాంకులు ఎక్కువగా వడ్డీ చెల్లిస్తున్నాయి. ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ వంటి చిన్న ఫైనాన్స్ బ్యాంకులు 7% వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. డిసిబి బ్యాంక్ వంటి వారు 6.75% వడ్డీ రేటును ఇస్తున్నారు. తరువాత ఆర్బిఎల్ బ్యాంక్ (6.25%), బంధన్ బ్యాంక్ (6%) ఉన్నాయి.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ , ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ఈ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇవి 3 నుంచి 3.5% వరకు వడ్డీ రేట్లను అందిస్తాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ 4% వరకు వడ్డీ రేటును అందిస్తుండగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) 2.70% వడ్డీని ఇస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 3.20% వరకు వడ్డీని అందిస్తోంది.
అయితే ఒక విషయం వినియోగదారులు తెలుసుకోవాలి. చిన్న ప్రైవేట్ బ్యాంకుల కనీస బ్యాలెన్స్ పెద్ద బ్యాంకుల కంటే ఎక్కువగా ఉంటుంది. ఒక పెద్ద బ్యాంకులో కనీస బ్యాలెన్స్ 500 రూపాయల కంటే తక్కువగా ఉంటుంది, అదే AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో రూ.2,000 ఉంటుందని అంచనా. పొదుపు ఖాతా తెరిచేటప్పుడు పెద్ద బ్యాంకు, మంచి సేవలు, రాబడి ఇతరత్రా విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.