Petrol – Diesel Price Today: వాహనదారులకు ఊరట.. పెట్రోల్, డీజిల్ ధరలకు రెండోరోజు బ్రేక్..
Fuel Price Today: దేశంలో గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. చమరు కంపెనీలు తీసుకుంటున్న నిర్ణయంతో
Fuel Price Today: దేశంలో గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. చమరు కంపెనీలు తీసుకుంటున్న నిర్ణయంతో చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర వంద మార్క్ దాటింది. దేశ రాజధాని ఢిల్లీ సహా ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ సహా అన్ని మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటి పరుగులుపెడుతోంది. ఈ క్రమంలో వాహనదారులకు కొంత ఉపశమనం కలిగింది. వరుసగా రెండోరోజు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. జూలైలో ఇప్పటివరకు ఇంధన ధరలు దాదాపు ఏడుసార్లు పెరిగాయి. అయితే.. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..
ప్రధాన నగరాల్లో ధరలు.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.100.19 గా ఉండగా.. డీజిల్ రూ.89.72 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.107.20, డీజిల్ రూ.97.29 పైసలుగా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.35, డీజిల్ రూ.92.81 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.101.92, డీజిల్ ధర రూ.94.24 గా ఉంది. బెంగుళూరులో పెట్రోల్ రూ.104.58 గా ఉండగా.. డీజిల్ రూ.95.09 కి చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.105.15 ఉండగా.. డీజిల్ రూ.97.78 గా కొనసాగుతోంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర 104.70, డీజిల్ ధర 97.35 గా ఉంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర రూ.107.30గా.. డీజిల్ ధర రూ. 99.36 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 106.15 ఉండగా.. డీజీల్ ధర రూ.98.27 గా కొనసాగుతోంది.
Also Read: