AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Rules: రైలు ఆలస్యమైందా అయితే గుడ్ న్యూస్.. మీ ఛార్జీలు వాపస్.. ఎలాగో తెలుసుకోండి..

మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకొని రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? అయితే ముందు ఐఆర్‌సీటీసీ టికెట్ క్యాన్సలేషన్, రీఫండ్ రూల్స్ తెలుసుకోండి.  

IRCTC Rules: రైలు ఆలస్యమైందా అయితే గుడ్ న్యూస్.. మీ ఛార్జీలు వాపస్.. ఎలాగో తెలుసుకోండి..
Train
TV9 Telugu Digital Desk
| Edited By: Sanjay Kasula|

Updated on: Jul 14, 2021 | 8:52 AM

Share

అసలే కరోనా కాలం.. ఆపై దేశవ్యాప్తంగా స్పెషల్ ట్రైన్స్ తిరుగుతుండటంతో టికెట్లు అంత ఈజీగా దొరకని పరిస్థితి. మనం దూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు ముందుగానే రైలు టికెట్లు రిజర్వేషన్ చేసుకోవాల్సి వస్తుంది. తద్వారా ఎలాంటి సమస్య లేకుండా అనుకున్న రోజు ప్రయాణం చేయవచ్చు. అయితే చాలామందికి రిజర్వేషన్ టికెట్లు ఎన్ని రోజులు ముందు బుక్ చేసుకోవాలన్నది తెలియదు. ఒక వేల చేసుకునున్నాకోవిడ్ వ్యాప్తి సమయంలో ఎన్నో అనుమానాలు.. మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకొని రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? అయితే ముందు ఐఆర్‌సీటీసీ టికెట్ క్యాన్సలేషన్, రీఫండ్ రూల్స్ తెలుసుకోండి.

ప్రపంచంలోనే భారత రైల్వే నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్కుగా ప్రసిద్దిగాంచింది . భారతీయ రైల్వే నడుపుతున్న ప్యాసింజర్ రైళ్లలో రోజూ కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా, భారత రైల్వే ప్రస్తుతం పరిమిత సేవలను మాత్రమే అందిస్తోంది. కాలంతోపాటు భారతీయ రైల్వే నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి భారత రైల్వే నిరంతరం మార్పులు తీసుకుంటోంది. అయితే, మన రైల్వే వ్యవస్థపై ఓ పాత సామెత ఉంది. నీవు ప్రయాణించాల్సిన ట్రైన్ జీవిత కాలం ఆలస్యం.. ఇలాంటి సమస్యను పరిష్కరించే పనిలో కొంత వరకు సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. ఆలస్యంగా వచ్చే రైల్ల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. అయినా.. గంటలు ఆలస్యంగా నడుస్తున్న భారతీయ రైళ్ల గురించి మనకు తెలిసిందే.

రైళ్ల ఆలస్యం..

రైళ్ల ఆలస్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కానీ రైల్వేలకు ఈ దిశలో ఇంతవరకు గణనీయమైన విజయం సాధించలేక పోయింది. రైళ్లు ఆలస్యం కావడంతో వేలాది మంది ప్రయాణికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అన్ని రైళ్లను సకాలంలో నడపడం,  ప్రయాణికులను సకాలంలో గమ్యస్థానంకు చేర్చడం భారత రైల్వే బాధ్యత. అంతే కాదు ఏదైనా రైలు ఆలస్యం అయితే… రైల్వే టికెట్ డబ్బును కూడా ప్రయాణీకులకు తిరిగి ఇస్తుంది. అయితే, ఈ సౌకర్యం గురించి చాలా కొద్ది మంది రైల్వే ప్రయాణికులకు తెలియదు.

మీరు పూర్తి డబ్బును తిరిగి పొందవచ్చు

భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణీకులకు కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయి. ఈ హక్కుల ప్రకారం మీ రైలు ఆలస్యం అయితే మీరు మీ టికెట్ కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని రైల్వే నుండి తిరిగి పొందవచ్చు. రైల్వే నిబంధనల ప్రకారం మీ రైలు 3 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయితే మీరు మీ టికెట్‌ను రద్దు చేసుకొని పూర్తి మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. ఇప్పుడు మీ టికెట్ RAC లేదా వెయిటింగ్‌లో ఉందా తెలుసుకోండి. ఇంతకుముందు  అధికారులు కౌంటర్ నుండి టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉండేది. అయితే  ఆ తర్వాత ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకుల కోసం ఇది అమలులోకి వచ్చింది.

వాపసు పొందడానికి ఈ పని చేయాలి

మీరు ప్రయాణించాల్సిన రైలు 3 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయితే మీ టికెట్‌ రద్దు చేసుకునే అవకాశం ఉంది. ముందుగా స్టేషన్  టికెట్ కౌంటర్‌కు వెళ్లి టికెట్‌ను రద్దు చేసుకోవచ్చు. ఇలా పూర్తి మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. మీరు మీ టికెట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే.. దీని కోసం మీరు ఆన్‌లైన్ TDR (టికెట్ డిపాజిట్ రసీదు) ఫారమ్‌ను నింపాల్సి ఉంటుంది. TDR నింపిన వెంటనే మీకు సగం టికెట్ డబ్బు లభిస్తుంది. రైలు ప్రయాణం పూర్తయిన తర్వాత మిగిలిన సగం డబ్బు లభిస్తుంది. మీ వ్యక్తిగత కారణాల వల్ల మీరు టికెట్‌ను రద్దు చేస్తే, రద్దు ఛార్జీని తీసివేసిన తరువాత రైల్వే మీకు డబ్బు తిరిగి ఇస్తుంది.

ఇవి కూడా చదవండి : Drone Challenge: బోర్డర్‌లో టెన్షన్‌..టెన్షన్‌..! అర్నియా సెక్టార్‌లో డ్రోన్లు.. పుల్వామా జిల్లా కేంద్రంలో కాల్పులు..

TRS EC Meeting: ఇవాళ TRS కార్యనిర్వాహక భేటీ.. పార్టీ కార్యాలయాల పురోగతిపై సమీక్ష