Currency Notes Missing: హై సెక్యూరిటీ ఉన్నా.. కొత్త రూ.500 నోట్లు మాయం.. నాసిక్ ప్రెస్‌లో కలకలం..

Currency Note Press: కరెన్సీ నోట్ ప్రెస్.. 24 గంటలపాటు హై సెక్యూరిటీ ఉంటుంది. అయినా అలాంటి నోట్ల ముద్రణ కేంద్రం నుంచి.. రూ. 5లక్షల నగదు మాయమైంది. ఈ సంఘటన

Currency Notes Missing: హై సెక్యూరిటీ ఉన్నా.. కొత్త రూ.500 నోట్లు మాయం.. నాసిక్ ప్రెస్‌లో కలకలం..
Currency Notes Missing
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 14, 2021 | 6:54 AM

Currency Note Press: కరెన్సీ నోట్ ప్రెస్.. 24 గంటలపాటు హై సెక్యూరిటీ ఉంటుంది. అయినా అలాంటి నోట్ల ముద్రణ కేంద్రం నుంచి.. రూ. 5లక్షల నగదు మాయమైంది. ఈ సంఘటన అధికార వర్గాల్లో కలకలం రేపింది. మహారాష్ట్ర నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్ (సీఎన్‌పి) లో ఈ నోట్ల మాయం ఘటన చోటుచేసుకుంది. సీఎన్‌పీ నుంచి గత ఐదు నెలల్లో గుర్తు తెలియని వ్యక్తులు రూ.5 లక్షల విలువైన కరెన్సీ నోట్లను దొంగిలించినట్లు ఉప్నగర్ పోలీస్ స్టేషన్ పోలీస్ ఇన్స్పెక్టర్ అనిల్ షిండే మంగళవారం వెల్లడించారు. నాసిక్ కరెన్సీ నోట్ ప్రెస్‌లో అత్యధికంగా నోట్లు ముద్రవుతుంటాయి. ఈ క్రమంలో 2021 ఫిబ్రవరి 12 నుంచి జూలై 12 మధ్య గుర్తు తెలియని వ్యక్తులు రూ.5 లక్షల రూపాయల విలువైన కరెన్సీ నోట్లను దొంగిలించినట్లు పోలీసు అధికారి వెల్లడించారు.

ఈ మేరకు ఇండియా సెక్యూరిటీ ప్రెస్ మేనేజర్ ఉప్నాగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. రూ.500 నోట్లు మొత్తం 1000 అపహరణకు గురైనట్లు వెల్లడించారు. అయితే హై సెక్యురిటీ ఉండే కరెన్సీ నోట్ ప్రెస్‌లోకి ఇతరులు ప్రవేశించే ఛాన్స్ లేదని.. లోపల పనిచేసే సిబ్బందే ఎవరో ఒకరు దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నామన్నారు. దీనికోసం సీసీ టీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని మంగళవారం సాయంత్రం ఉప్నాగర్ పోలీసు అధికారి వెల్లడించారు. ఈ ఘటనపై ఐపీసీ 380, 454, 457 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

కాగా.. దేశంలో ఉన్న పురాతన యూనిట్లల్లో ఇండియా సెక్యూరిటీ ప్రెస్ ఒకటి. ఈ సంస్థ కరెన్సీ నోట్లతోపాటు పాస్‌పోర్టులు, రెవెన్యూ తదితర ధ్రువీకరణ పత్రాలను ముద్రిస్తుంది. అయితే.. అనునిత్యం హై సెక్యురిటీ ఉన్న సీఎన్‌పీలో నోట్లు చోరీకి గురికావడం అటు అధికార వర్గాలతో పాటు పోలీసులను కూడా షాక్‌కు గురిచేసింది.

Also Read:

ACB: వికారాబాద్‌ జిల్లాలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన ఎస్సై

Bank Fake Robbery: తీసిఉన్న బ్యాంకు తాళాలు.. చోరీ జరిగిందంటూ అధికారుల టెన్షన్.. అసలు విషయమేంటంటే..?