Bank Fake Robbery: తీసిఉన్న బ్యాంకు తాళాలు.. చోరీ జరిగిందంటూ అధికారుల టెన్షన్.. అసలు విషయమేంటంటే..?
Kanigiri Bank of India: బ్యాంకు సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. నిర్లక్ష్యంగా అస్సలే వ్యవహరించరన్న విషయం మనందరికీ తెలుసు. అయితే అలాంటి ఓ
Kanigiri Bank of India: బ్యాంకు సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. నిర్లక్ష్యంగా అస్సలే వ్యవహరించరన్న విషయం మనందరికీ తెలుసు. అయితే అలాంటి ఓ బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం.. అందర్నీ ముచ్చెమటలు పట్టేలా చేసింది. అటు పోలీసులు, ఇటు బ్యాంకు అధికారులంతా పరుగులు తీశారు. బ్యాంకులో చోరీ జరిగిందని టెన్షన్ పడ్డారు. తీరా విషయం తెలుసుకున్న అధికారులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ గమ్మునున్నారు. తమ తప్పు తెలుసుకుని నాలుక్కరుచుకున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కనిగిరి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోటుచేసుకుంది.
కనిగిరి బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి రెండు తాళాలు ఉండగా.. సోమవారం సాయంత్రం సిబ్బంది ఒక తాళం వేయడం మరచిపోయారు. ఈ చిన్నపాటి నిర్లక్ష్యం అందరిని కంగారుకు గురిచేసింది. మంగళవారం ఉదయం విధులకు వెళ్లిన సిబ్బంది.. ఒక తాళం తీసి ఉండటం చూసి కంగారు పడ్డారు. తాళం వేయలేదనే పొరపాటు గుర్తించకుండా తీవ్ర భయాందోళనకు గురై అధికారులను అప్రమత్తం చేశారు. బ్యాంకులో చోరీ జరిగిందని భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బ్యాంకును నిశితంగా పరిశీలించారు. అధికారులను, చుట్టుపక్కల వారిని విచారించారు. ఆ తర్వాత, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.
అంతా పరిశీలించాక అసలు నిజం తెలిసి బ్యాంకు సిబ్బంది, పోలీసులు షాక్‌కు గురయ్యారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇదంతా జరిగిందని తేల్చారు. కార్యాలయం నుంచి వెళ్లిపోయే సమయంలో సిబ్బంది తాళం వేయడం మర్చిపోయారని.. బ్యాంకులో ఎలాంటి చోరీ జరగలేదని పోలీసులు తెలిపారు.
Also Read: