Sourav Ganguly: లార్డ్స్‌ విజయానికి 19 ఏళ్లు.. చొక్కా విప్పి గిరగిరా తిప్పిన గంగూలీ..!

ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎన్నో మ్యాచులు గుర్తుండేలా చేస్తాయి. సరికొత్త చరిత్రను నెలకొల్పుతాయి. 19 ఏళ్ల క్రితం భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన నాట్‌వెస్ట్‌ సిరీసు ఫైనల్‌ గుర్తుందా. ఈ మ్యాచ్ కూడా ఇలాందే అనడంలో సందేహం లేదు.

Sourav Ganguly: లార్డ్స్‌ విజయానికి 19 ఏళ్లు.. చొక్కా విప్పి గిరగిరా తిప్పిన గంగూలీ..!
19 Years To The Lord's Victory
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Venkata Chari

Updated on: Jul 13, 2021 | 8:48 PM

Sourav Ganguly: ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎన్నో మ్యాచులు గుర్తుండేలా చేస్తాయి. సరికొత్త చరిత్రను నెలకొల్పుతాయి. 19 ఏళ్ల క్రితం భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన నాట్‌వెస్ట్‌ సిరీసు ఫైనల్‌ గుర్తుందా. ఈ మ్యాచ్ కూడా ఇలాందే అనడంలో సందేహం లేదు. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్‌ క్రికెట్ ప్రేమికులతోపాటు కెప్టెన్ గంగూలీకి కూడా ఎంతో సంతోషాన్ని అందించింది. విజయంతో ఉప్పొంగిపోయిన దాదా లార్డ్స్ స్టేడియంలో చొక్కా విప్పి తన ఆనందాన్ని ప్రదర్శించాడు. ఇది జరిగి నేటికి సరిగ్గా 19 ఏళ్లు. ఈ సందర్భంగా బీసీసీఐ మ్యాచ్ చివరి క్షణాల వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. చేధనలో టీమిండియా 146 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆనాటి యువ ఆటగాళ్లు యూవీ, కైఫ్ అద్భుతంగా ఆడి మంచి భాగస్వామ్యంతో మ్యాచ్‌ను టీమిండియాకు అనుకూలంగా మలచడంతో రికార్డు నెలకల్పారు.

మ్యాచ్ విషయానికి వస్తే.. లార్డ్స్‌ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ మొదట బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్లు కొల్పోయి 325 పరుగులు చేసింది. ఇంగ్లీష్ బ్యాల్స్ మెన్స్ లో నాసర్‌ హుస్సేన్‌ (115; 128 బంతుల్లో 10×4), ఓపెనర్‌ మార్కస్‌ ట్రెస్కోథిక్‌ (109; 100 బంతుల్లో 7×4, 2×6) సెంచరీలు బాదారు. మరో బ్యాట్స్ మెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ 40 పరుగులు సాధించాడు. అనంతరం 326 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు వీరేంద్ర సెహ్వాగ్‌ (45; 49 బంతుల్లో 7×4), సౌరవ్‌ గంగూలీ (60; 43 బంతుల్లో 10×4, 1×6) మంచి ఆరంభాన్ని అందించారు. వీరు పెవిలియన్ చేరిన తరువాత దినేశ్‌ మోంగియా (9), సచిన్‌ (14), ద్రవిడ్‌ (5) వికెట్లు వెంట వెంటనే కోల్పోయింది. 146/5 తో ఇబ్బందుల్లో కూరుకపోయింది. ఇక టీమిండియా గెలవడం చాలా కష్టమనుకున్నారు. కానీ, యంగ్ బ్యాట్స్‌మెన్స్ యువరాజ్‌ సింగ్‌ (69; 63 బంతుల్లో 9×4, 2×6), మహ్మద్‌ కైఫ్‌ (87 నాటౌట్; 75 బంతుల్లో 6×4, 2×6), హర్భజన్ 13 బంతుల్లో 15 పరుగులు చేసి టీమిండియాకు అద్భుతమైన విజయం అందించారు. మరో 3 బంతులు మిగిలుండగానే 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై విజయం సాధించింది. దాంతో గంగూలీ ఆనందంతో చొక్కా విప్పి గిరగిరా తిప్పుతూ హల్‌చల్ చేశాడు.

Also Read:

Vamika Photos: ముఖం చూపించకుండా ఫొటోలా.. వామికా ఫేస్ ఇంకెప్పుడు చూపిస్తారంటోన్న ఫ్యాన్స్!

Viral Video: ఏం క్యాచ్ పట్టారుగా.. మీ సమయస్ఫూర్తికి జోహార్లంటోన్న నెటిజన్లు.. !