Sourav Ganguly: సౌరభ్ గంగూలీనే బెస్ట్ కెప్టెన్.. సచిన్ వికెట్‌కే నా తొలిప్రాధాన్యత: షోయబ్ అక్తర్
టీమిండియా బెస్ట్ కెప్టెన్లలో సౌరభ్ గంగూలీ, ధోనీ, కోహ్లీ ముందుంటారని, ఈ ముగ్గురిలో అత్యుత్తమ సారథిగా గంగూలీనే ఫస్టుంటాడని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.
Sourav Ganguly: టీమిండియా బెస్ట్ కెప్టెన్లలో సౌరభ్ గంగూలీ, ధోనీ, కోహ్లీ ముందుంటారని, ఈ ముగ్గురిలో అత్యుత్తమ సారథిగా గంగూలీనే ఫస్టుంటాడని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పలు ఆసక్తికర ప్రశ్నలకు జవాబులిచ్చాడు. మాజీ సారథి, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీనే భారత బెస్ట్ కెప్టెన్ అని అన్నాడు. అలాగే గంటకి 161.3కిమీ వేగంతో బంతిని విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పిన షోయబ్ అక్తర్.. ఎంతో మంది బ్యాట్స్‌మెన్‌కు నిద్రలేకుండా చేసేవాడు. ఇలాంటి బౌలర్‌ను ఎంతో ఇబ్బంది పెట్టిన బ్యాట్స్‌మెన్ కూడా ఉన్నాడని తెలుసా.. అది కూడా ఓ స్పిన్నర్ అని తెలుసా? ఆయనెవరో కాదు శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అంట. నిజమేనంటూ బాంబ్ పేల్చాడు. ‘బక్క పల్చగా ఉండేవాడినంటూ, బంతిని నెమ్మదిగా విసరమని నావద్దకు వచ్చి ముళీధరన్ మొరపెట్టుకునేవాడు. బౌన్సర్లతో నన్ను చంపేయకు అనేవాడు. సరే అని నెమ్మదిగా బంతిని విసిరితే బాదేవాడని, ఇదేంటని అడిగితే ఏదో అలా జరిపోయిందంటూ చెప్పేవాడని చెప్పుకొచ్చాడు.
మరో ప్రశ్నకు.. కోల్‌కతాలో సచిన్‌ను ఔట్ చేసింది ఇష్టమా లేక ఫాస్టెస్ట్ డెలివరీ (161 కిమీ) ఇష్టమా అని అడగగా.. టెండూల్కర్ వికెట్‌కే నా తొలి ప్రాధాన్యం అంటూ చెప్పుకొచ్చాడు. అక్తర్ పాకిస్తాన్ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు పడగొట్టాడు. అలాగే 163 వన్డేల్లో 247 వికెట్లు పడగొట్టగా, 15 టీ20ల్లో 19 వికెట్లు తీసుకున్నాడు. పాకిస్తాన్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 224 మ్యాచ్‌లు ఆడిన రావల్పిండి ఎక్స్‌ప్రెస్ 444 వికెట్లు పడగొట్టాడు.
Also Read: