The Hundred: ‘ద హండ్రెడ్’.. క్రికెట్‌లో సరికొత్త ఫార్మాట్ ఎంట్రీ.. రూల్స్ ఏంటో తెలుసా!
ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన క్రికెట్... ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కనువిందు చేస్తూనే ఉంది. రూపాలు మార్చుకుంటూ అలరిస్తూనే ఉంది. టెస్టులు, పరిమిత ఓవర్లలో కొత్తగా టీ20లు, టీ10లు వచ్చిన సంగతి తెలిసిందే.
The Hundred: ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన క్రికెట్… ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కనువిందు చేస్తూనే ఉంది. రూపాలు మార్చుకుంటూ అలరిస్తూనే ఉంది. టెస్టులు, పరిమిత ఓవర్లలో కొత్తగా టీ20లు, టీ10లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా వినూత్నంగా క్రికెట్ అభిమానులకు మరింతగా చేరువవుతూనే ఉంది. తాజాగా మరో సరికొత్త ఫార్మాట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే ది హండ్రెడ్. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రవేశపెట్టిన ఈ ది హండ్రెడ్ ఫార్మాట్… కొత్త నిబంధనలతో అలరించేందుకు సిద్ధమైంది. ఇందులో ఇన్నింగ్స్‌కు 100 బంతుల చొప్పున ఉంటాయంట. ఈ ఫార్మాట్‌లో ఎనిమిది పురుషుల జట్లు, ఎనిమిది మహిళా జట్లు తలపడనున్నాయంట. అందరిలో ఆసక్తిని నెలకొల్పేలా రూల్స్‌ను కూడా తయారుచేసింది ఈసీబీ. ది హండ్రెడ్ ఫార్మాట్ రూల్స్ ఎలా ఉంన్నాయో చూద్దాం..
ఈ ఫార్మాట్‌లో టాస్ గ్రౌండ్‌లోనే వేయాల్సిన అవసరం లేదు. అలాగే దీంట్లో ఓవర్లు ఉండవు. కేవలం బంతుల ఆధారంగానే ఒక ఇన్నింగ్స్ ఉంటుంది. ఒక బౌలర్ ఒకే ఎండ్ నుంచి రెండుసార్లు ఐదేసి బంతులు వేయాలి. తొలి ఐదు బంతులు పూర్తయ్యాక అంపైర్ ఓ వైట్ కార్డు చూపిస్తాడు. దాంతో ఒక సెట్ పూర్తయినట్లు. ఇందులో తొలి 25 బంతులు పవర్ ప్లేగా నిర్ణయించారు. ఈ సమయంలో 30 గజాల సర్కిల్ బయట ఇద్దరు ఫీల్డర్లు ఉంటారు. అలాగే పవర్ ప్లే పూర్తయ్యాక ఫీల్డింగ్ టీమ్ ఎప్పుడైనా రెండు నిమిషాల స్ట్రేటజిక్ టైమౌట్ అంటే బ్రేక్ తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే, బ్యాట్స్‌మెన్ క్యాచ్ ఔట్ అయితే.. అవతలి బ్యాట్స్‌మన్ క్రాస్ అయ్యాడా లేదా అనే సంబంధం లేకుండా కొత్త బ్యాట్స్‌మన్ స్ట్రైక్ తీసుకుంటాడు. గ్రూప్ స్టేజ్‌లో మ్యాచ్ టై అయితే రెండు జట్లకు ఒక్కో పాయింట్ ఇవ్వనున్నారు. అదే ఎలిమినేటర్, ఫైనల్లో టై అయితే.. సూపర్ ఫైవ్ ఆడాల్సి ఉంటుంది. అంటే ఒక్కో టీమ్ ఐదు బాల్స్ ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ సూపర్ ఫైవ్ కూడా టై అయితే.. మరో సూపర్ ఫైవ్ ఆడిస్తారు. అప్పుడు కూడా మ్యాచ్ టై అయితే.. గ్రూప్ స్టేజ్‌లో టాప్‌లో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. వర్షం వల్ల మ్యాచ్‌లకు అంతరాయం ఏర్పడితే కొత్త డీఎల్ఎస్ పద్ధతిని అమలుచేయనున్నారు. ఒకవేళ జట్టు స్లోగా బౌలింగ్ చేస్తుందనుకుంటే అంపైర్‌కే పెనాల్టీ విధించే హక్కు ఉంటుంది. పెనాల్టీ విధించాల్సి వస్తే.. ఫీల్డింగ్ టీమ్‌కు సర్కిల్ బయట ఒక ఫీల్డర్‌ను తగ్గించాల్సి ఉంటుంది. అదన్న మాట. సరికొత్త ది హండ్రెడ్ ఫార్మాట్ కథ.
Also Read:
Sourav Ganguly: సౌరభ్ గంగూలీనే బెస్ట్ కెప్టెన్.. సచిన్ వికెట్‌కే నా తొలిప్రాధాన్యత: షోయబ్ అక్తర్
Sourav Ganguly: లార్డ్స్ విజయానికి 19 ఏళ్లు.. చొక్కా విప్పి గిరగిరా తిప్పిన గంగూలీ..!