ACB: వికారాబాద్‌ జిల్లాలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన ఎస్సై

Anti Corruption Bureau: తెలంగాణ రాష్ట్రంలో ఏ అధికారికి కూడా లంచాలు ఇవ్వకూడదని ప్రభుత్వం చెబుతుండగా, కొంత మంది అధికారులు ఆవేమి పట్టించుకోకుండా భారీగా లంచాలను..

ACB: వికారాబాద్‌ జిల్లాలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన ఎస్సై
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Subhash Goud

Updated on: Jul 13, 2021 | 9:03 PM

Anti Corruption Bureau: తెలంగాణ రాష్ట్రంలో ఏ అధికారికి కూడా లంచాలు ఇవ్వకూడదని ప్రభుత్వం చెబుతుండగా, కొంత మంది అధికారులు ఆవేమి పట్టించుకోకుండా భారీగా లంచాలను దండుకుంటున్నారు. ఏ చిన్న పని అయినా లంచాలు తీసుకోలేనిది చేయడం లేదు. నిరుపేదల నుంచి లంచాలకు అలవాటు పడిన అధికారులపై ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టింది.

తాజాగా వికారాబాద్‌ జిల్లాలో ఓ ఎస్సై ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. జిల్లాలోని పెద్దేముల్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు మంగళవారం రెడ్‌హ్యండేడ్‌గా దొరికిపోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మాంబాపూర్‌ గ్రామానికి చెందిన ఎంపీటీసీ శ్రీనివాస్‌ నుంచి ఇసుక అక్రమ రవాణా విషయంలో రూ.50వేలు లంచం డిమాండ్‌ చేశాడు. గత మూడు రోజుల కిందట ఎస్‌ఐకి శ్రీనివాస్‌ రూ.20వేల చెల్లించినట్లు తేలింది. ఇక మంగళవారం మరో రూ.30వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ చంద్రశేఖర్‌ను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంకా ఎంత మంది వద్ద లంచాలు తీసుకున్నారు.. అనే విషయంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆయన వద్ద ఉన్న డాక్యుమెంట్లను సైతం పరిశీలిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి

Covid-19: మావోయిస్టుల శిబిరాల్లో కరోనా కలకలం.. మహమ్మారితో మరో అగ్రనేత వినోద్ మృతి..

Business Idea: మంచి బిజినెస్ ఐడియా.. ఈ వ్యాపారంలో లక్షలు సంపాదించవచ్చు.. పూర్తి వివరాలు..!