Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nepal Tourism: శీతాకాలంలో నేపాల్‌లోని ఈ నగరం సందర్శించండి.. భూతల స్వర్గం ఇదేనేమో అనిపిస్తుంది..

ప్రపంచంలోని ఏకైక హిందూ దేశం నేపాల్‌. హిమాలయ పర్వతాల చెంత ఉండే ఈ అందమైన దేశం భూతల స్వర్గం. నేపాల్‌లో సందర్శించడానికి చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశాలున్నాయి. ఇందులో పోఖరా చాలా ప్రజాదరణ పొందింది. జనసమూహానికి దూరంగా..నిశ్శబ్ద ప్రదేశానికి వెళ్లాలనుకుంటే పోఖారా పర్యటనను ప్లాన్ చేసుకోవచ్చు. ఈ అందమైన ప్రదేశాలను అన్వేషించవచ్చు.

Nepal Tourism: శీతాకాలంలో నేపాల్‌లోని ఈ నగరం సందర్శించండి.. భూతల స్వర్గం ఇదేనేమో అనిపిస్తుంది..
Pokhara Places To Visit
Follow us
Surya Kala

|

Updated on: Dec 11, 2024 | 8:28 PM

నేపాల్‌లో సందర్శించడానికి చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణం, కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి ఇష్టపడే వారికి కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో ఏదైనా ప్రత్యేక స్థలాన్ని సందర్శించాలనుకుంటే నేపాల్‌ వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ పోఖారాను సందర్శించవచ్చు. పోఖారా చాలా అందమైన ప్రదేశం. పోఖారా ఆ దేశంలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. దీనిని పర్యాటకులు సందర్శించడానికి ఇష్టపడతారు. పోఖారాలోని ఈ అందమైన ప్రదేశాలను ఎలా అన్వేషించవచ్చో తెలుసుకుందాం..

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

ఇవి కూడా చదవండి

ఫేవా సరస్సు ఫేవా సరస్సు నేపాల్‌లోని రెండవ అతిపెద్ద సరస్సు. ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ సరస్సులోని స్వచ్ఛమైన నీటిలో అన్నపూర్ణ , ధౌలగిరి పర్వత శ్రేణుల ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడి సహజ దృశ్యం ఆకట్టుకుంటుంది. సమీపంలోని చెట్లు, మొక్కలు కూడా సరస్సులోని స్వచ్ఛమైన నీటిలో ఊగుతూ కనిపిస్తాయి. ఇక్కడ జన సంద్రానికి దూరంగా కొంత సమయం ప్రశాంతంగా గడిపే అవకాశం లభిస్తుంది. అంతే కాదు సూర్యాస్తమయం దృశ్యం కూడా చాలా మనోహరంగా కనిపిస్తుంది.

అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్కింగ్ ఇష్టపడే వారు తరచుగా ఇక్కడికి వస్తుంటారు. ఈ ట్రెక్కింగ్ రెండు వేర్వేరు నదీ లోయల మధ్య సాగుతుంది. ఇక్కడ అన్నపూర్ణ శ్రేణి, ధౌలగిరి, మనస్లు, గంగాపూర్ణ, తిలిచో శిఖరం, పౌంగ్రా దాండ్ , పిసాంగ్ శిఖరం వంటి పర్వత దృశ్యాలను సమీపం నుండి చూసే అవకాశం లభిస్తుంది.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

శాంతి స్థూపం పోఖరాలో శాంతి స్థూపం ఉంది. ఇది కొండ పైభాగంలో ఉన్న బౌద్ధ స్మారక చిహ్నం. ఫేవా సరస్సు కూడా ఇక్కడ నుంచి చూడవచ్చు. పర్వతాలు అందాలు వాటి మధ్య ఈ స్థూపాలు ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. పోఖారాను సందర్శించడానికి వెళితే శాంతి స్తూపాన్ని తప్పకుండా సందర్శించండి.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

డేవిస్ జలపాతం పోఖారాలో డేవిస్ ఫాల్ కూడా ఆకర్షణీయమైన ప్రదేశం. ఇది భూగర్భంలో ఉంది. ఇది 500 మీటర్ల పొడవైన సొరంగం. ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతం దట్టమైన చెట్లతో నిండి ఉంది. ఇది ఇతర జలపాతాల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ సరస్సు గుప్తేశ్వర్ మహాదేవ్ అనే గుహ గుండా వెళుతుంది. ఇక్కడ నేపాల్ సంస్కృతిని చూసే అవకాశం లభిస్తుంది.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

View this post on Instagram

A post shared by Sue C (@sue_take2)

గుప్తేశ్వర మహాదేవ గుహ గుప్తేశ్వర మహాదేవ గుహ డేవిస్ ఫాల్ దగ్గర ఉంది. గుహ ద్వారం వద్దకు తీసుకెళ్తున్న ఒక మురి మెట్లు ఉంది. ఈ గుహ శివలింగంలా కనిపిస్తుంది. ఇవి ప్రజల పాత ఇళ్లు అని నమ్ముతారు. ఇది గొప్ప మతపరమైన, పర్యాటక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

సారంగ కోట ఇది సారంగ కోట పర్వతంపై ఉన్న ఒక చిన్న గ్రామం. ఇది పోఖారా శివార్లలో ఉంది. పోఖారా లోయ దృశ్యాలు ఇక్కడ నుంచి చూడవచ్చు. అంతేకాదు ఈ ప్రదేశం పారాగ్లైడింగ్‌కు కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సూర్యాస్తమయం అందమైన దృశ్యాన్ని చూడవచ్చు. అంతేకాదు అన్నపూర్ణ, ధౌలగిరి, మనస్లు, పోఖరా లోయ దృశ్యం కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..