AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kabul Blast: కాబూల్ మంత్రివర్గంపై ఆత్మాహుతి దాడి.. తాలిబాన్ ప్రభుత్వ మంత్రి హక్కానీ సహా 12 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో తాలిబన్ ప్రభుత్వ మంత్రి సహా 12 మంది మరణించారు. నివేదికల ప్రకారం.. మంత్రిత్వ శాఖ సమావేశం జరుగుతున్న ప్రాంగణంలో పేలుడు సంభవించింది.

Kabul Blast: కాబూల్ మంత్రివర్గంపై ఆత్మాహుతి దాడి.. తాలిబాన్ ప్రభుత్వ మంత్రి హక్కానీ సహా 12 మంది మృతి
Khalil Rahman HaqqaniImage Credit source: Social Media
Surya Kala
|

Updated on: Dec 11, 2024 | 7:35 PM

Share

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది. బుధవారం కాబూల్‌లోని శరణార్థుల మంత్రిత్వ శాఖ కాంపౌండ్‌లో జరిగిన పేలుడులో తాలిబాన్ శరణార్థుల మంత్రి ఖలీల్ రహ్మాన్ హక్కానీ, అతని ముగ్గురు అంగరక్షకులు సహా 12 మంది మరణించారు. నివేదికల ప్రకారం ఖోస్ట్ నుంచి వస్తున్న వ్యక్తుల బృందానికి హక్కానీ ఆతిథ్యం ఇస్తున్నప్పుడు ఈ దాడి జరిగింది. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం ఈ దాడిలో హక్కానీ మరణించినట్లు తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి ధృవీకరించారు.

కాబూల్ మంత్రివర్గంపై ఆత్మాహుతి దాడి!

ప్రస్తుతం ఆ దేశ రాజధాని కాబూల్‌లోని మంత్రిత్వ శాఖ ప్రాంగణంలో ఈ పేలుడు ఎలా జరిగింది? ఎవరు చేశారు అనేదానికి సంబంధించి ఎక్కువ సమాచారం వెల్లడి కాలేదు. అయితే కాబూల్‌లోని శరణార్థుల మంత్రిత్వ శాఖ ఆవరణలో జరిగిన ఆత్మాహుతి దాడి చేసినట్లు తెలుస్తోంది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అందిన సమాచారం ఆధారంగా ఈ దాడి ఆత్మాహుతి దాడి అని అభివర్ణించింది. మీడియా కథనాల ప్రకారం ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకుని మరణించాడు. చాలా మంది గాయపడ్డారు.

ఖలీల్ రెహ్మాన్ హక్కానీ నెట్‌వర్క్‌తో సంబంధం

ఆగస్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాలిబాన్ అంతర్గత మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ మామ, హక్కానీ నెట్‌వర్క్‌లో కీలక వ్యక్తి. ఖలీల్ రెహ్మాన్ హక్కానీ 7 సెప్టెంబర్ 2021న శరణార్థుల తాత్కాలిక మంత్రిగా నియమితులయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఈ పేలుడులో ఐఎస్ఐఎస్ హస్తం ఉన్నట్లు అనుమానం

ఇస్లామిక్ స్టేట్, తాలిబాన్‌ల మధ్య కొనసాగుతున్న ఘర్షణలే ఈ దాడికి కారణం అని ప్రాథమిక నివేదికలు పేర్కొంటున్నాయి, అయితే ఈ దాడి తమ పనే అంటూ ఏ సంస్థ ఇంకా ప్రకటించలేదు.

నివేదికల ప్రకారం ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISIS-K) తరచుగా ఇటువంటి దాడులను చేస్తోంది. ఇది గత కొన్ని నెలలుగా తాలిబాన్ ప్రభుత్వంతో ఉద్రిక్తతలు పెంచింది. ప్రస్తుతం ఘటనపై పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..