AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీకెండ్ హాలీడేస్ ఈ అందమైన ప్రాంతాల్లో ఎంజాయ్ చేయాల్సిందే.. ఒక్కసారి చూస్తే అస్సలు మార్చిపోరు..

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆయా రాష్ట్రాల వారిగా లాక్‏డౌన్‏ను ఎత్తివేశాయి. దీంతో ఇన్ని రోజులు ఇంట్లోనే

వీకెండ్ హాలీడేస్ ఈ అందమైన ప్రాంతాల్లో ఎంజాయ్ చేయాల్సిందే.. ఒక్కసారి చూస్తే అస్సలు మార్చిపోరు..
TV9 Telugu Digital Desk
| Edited By: Rajitha Chanti|

Updated on: Jul 15, 2021 | 9:45 PM

Share

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆయా రాష్ట్రాల వారిగా లాక్‏డౌన్‏ను ఎత్తివేశాయి. దీంతో ఇన్ని రోజులు ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్‏తో ఉక్కిరిబిక్కిరి అయిన వారు వీకెండ్ హాలీడేస్‏కు తమ చుట్టు పక్కల ఉన్న ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఇక బెంగుళూరు, కర్ణాటక వంటిలో లాక్‏డౌన్ తొలగించడంతో ప్రజలు వారంతపు సెలవులను ఈ ప్రదేశాలలో ఎంజాయ్ చేయ్యొచ్చు. బెంగుళూరు చుట్టు పక్కల ఉన్న అందమైన ప్రాంతాలను చూసి తీరాల్సిందే.

02 హులియూర్దుర్గా.. బెంగుళూరుకు సమీపంలో ఉన్న తొమ్మిది కోటలలో హులియూర్దుర్గా కోట కూడా ఒకటి. దీనిని బెంగుళూరు వ్యవస్థాపకుడు కెంపే గౌడ నిర్మించినట్లుగా చెబుతారు. ఇక్కడి బెంగుళూరు నుంచి బస్సు ప్రయాణం మూడు గంటలు. దీనిని “కుంబి బెట్టా” అంటారు. ఇక్కడ ట్రెక్కింగ్ సమీప గ్రామమైన హులియుదుర్గా నుండి ప్రారంభమవుతుంది. రాళ్లతో చేసిన గోడ ద్వారా కొండపైకి ఎక్కాలి. దాదాపు 30 నిమిషాల సమయం పడుతుంది. ఇక్కడి కొండపై మల్లేశ్వర ఆలయం ప్రసిద్ది. ఫిబ్రవరి నెలలో ఇక్కడకు అనేక మంది పర్యాటకులు వస్తుంటారు. సముద్ర మట్టానికి 847 మీటర్ల ఎత్తులో ఉన్నప్పటికీ, కొండ సమీప గ్రామం.. పచ్చని ప్రకృతి, కోట గోడ శిథిలాలు అద్భుతమైన దృశ్యాలు.

03

నంది కొండలు… నంది కొండల పైన గంగా రాజవంశం రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు నిర్మించిన పురాతన కొండ కోట. బెంగళూరు నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కొండ పై అనేక స్మారక నిర్మాణాలు, దేవాలయాలు, తాష్క్-ఎ-జన్నాత్ లేదా టిప్పు సుల్తాన్ వేసవి విడిది కూడా. ఎత్తైన స్తంభాలు, పైకప్పులతో కూడిన వంపు మార్గాలు చూడవచ్చు. కాలిబాటలో నడుస్తున్నప్పుడు, చిన్న శ్రీ గవి వీరభద్ర స్వామి ఆలయం ఒక గుహ నిర్మాణంలో ఉంది. ఇక్కడ 1928 లో నిర్మించిన స్టెప్‌వెల్ రిజర్వాయర్ అయిన అమృతా సరోవర్ ను కూడా చూడవచ్చు.

04

సవన్ దుర్గా.. మగడి రోడ్డున బెంగళూరు నుండి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో సవన్ దుర్గా ఉంటుంది. ఆసియాలో అతిపెద్ద ఏకశిలా ఇది. ఇది సగటు సముద్ర మట్టానికి 1226 మీ. సమీపంలో ప్రవహించే ఆర్కవతి నదిని, మగడి దృశ్యాలను, సూర్యోదయాన్ని చూడటానికి తెల్లవారుజామున 5 గంటలకు కాలిబాటలో వెళ్లాలి. నల్ల కోండ, తెల్ల కొండలను కలిపి సవన్ దుర్గా అంటారు. సవన్ దుర్గా కోట 1638 నుండి 1728 వరకు కెంపెగౌడ యొక్క రెండవ రాజధాని. సవండి వీరభద్రస్వామి ఆలయం, శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. కొండపైకి మొత్తం ట్రెక్కింగ్ 2 కి.మీ.

05

బన్నర్ ఘట్ట.. బెంగళూరుకు దక్షిణాన 22 కిలోమీటర్ల దూరంలో బన్నర్‌ఘట్ట నేషనల్ పార్క్ ఉంది. ఇక్కడికి బెంగుళూరు నుంచి గంటలో చేరుకోవచ్చు. దారిలో మధురైలో ఉన్న ఆలయానికి సమానమైన మీనాక్షి ఆలయం ఉంది. ఉద్యానవనం లోపల ఉన్న వాహనాలపై గ్రిల్స్ ఉన్నాయి. సింహాలు, పులులు, జింకలు, ఎలుగుబంట్లు దగ్గరి నుండి చూడటానికి అనుమతి ఉంది. ఇక్కడ సీతాకోకచిలుక పార్క్ కూడా ఉంది. ఇది బిఆర్ హిల్స్ సత్యమంగళం అడవిని కలుపుతుంది.

06

మధుగిరి.. బెంగళూరు నుండి కేవలం 107 కిలోమీటర్ల దూరంలో.. ఏకశిలా కొండ కర్ణాటకలోని మధుగిరి నగరంలో ఉంది. ఇక్కడ కాలిబాట దాదాపు 1.6 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. సముద్ర మట్టానికి 1200 మీటర్ల ఎత్తులో తిమ్మలపుర అటవీ, చుట్టుపక్కల ఉన్న సరస్సుల కొండ, ఉత్కంఠభరితమైన దృశ్యాలను చూడవచ్చు. ఈ కోటను రాజా హైర్ గౌడ సిర్కా 17వ శతాబ్దంలో నిర్మించారు. 2-2.5 గంటల ట్రెక్ ప్రమాదకరంగా ఉంటుంది. ఈ కొండ చుట్టూ చారిత్రక ప్రాముఖ్యత ఉన్న దేవాలయాలు ఉన్నాయి.

Also Read: మన టాలీవుడ్ స్టార్ హీరో చిన్నప్పుడు ఎలా ఉన్నారో చుశారా ? అయితే ఈ ఫోటోలో ఉన్న పిల్లాడిని గుర్తుపట్టండి చూద్దాం..

Evaru Meelo Koteeswarulu: “ఎవరు మీలో కోటీశ్వరులు” షోలో మొదట వచ్చే గెస్ట్ ఎవరో తెలుసా.. తారక్ ముందుగా ప్రశ్నించేది ఆ స్టార్‏నే అంటా..