Araku Valley Train Journey: హమ్మయ్య..! అరకు అందాల రైలు.. మళ్లీ వచ్చింది
హమ్మయ్య..! అరకు రైలొచ్చింది. కోవిడ్ కారణంగా రద్దైన అరకు రైలు మళ్లీ కూతపెట్టింది. కొండలు, గుహలు దాటుకుంటూ ముందుకు సాగింది.
హమ్మయ్య..! అరకు రైలొచ్చింది. కోవిడ్ కారణంగా రద్దైన అరకు రైలు మళ్లీ కూతపెట్టింది. కొండలు, గుహలు దాటుకుంటూ ముందుకు సాగింది. దీంతో.. ఇన్నాళ్లూ అరకు ఆహ్లాదానికి దూరమైన పర్యాటకులు ఇప్పుడు ఈ రైలు పునరుద్ధరణతో క్యూ కడుతున్నారు. కొత్తవలస- కిరండోల్ (కేకేలైన్) మధ్య నడిచే రైలును అధికారులు పునరుద్ధరించారు. అరకు రూట్లో నడిచే ఏకైక పాసింజర్ రైలు కావడంతో.. పర్యాటకులు ఈ జర్నీపై ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు . రైలు పునః ప్రారంభమైందని తెలుసుకున్న సందర్శకులు చాలామంది… ఈ రైలెక్కి అరకుకు ప్రయాణమయ్యారు. ఎత్తైన కొండలు, లోయలు, వాగులు దాటుకుంటూ సాగే ఈ రైలు ప్రయాణం అనుభూతే వేరు. రోడ్డు మార్గమున్నా.. రైలు మార్గంలోనే అరకు వెళ్ళేందుకు జనం ఇష్టపడతారు. కోవిడ్ కారణంగా అరకు సుందర ప్రకృతి అందాలకు దూరమైన పర్యాటకులు.. రైలు కూతపెట్టిందని సంగతి తెలుసుకుని క్యూ కట్టారు. ఛలో అరకు అంటూ.. రైలెక్కి ప్రయాణమయ్యారు.
అరకు రైల్వే స్టేషన్‌లో దిగగానే ఆనందంతో కేరింతలు కొట్టారు పర్యాటకులు. అటు అధికారులు రైల్లో కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మాస్క్ లు ధరించి ప్రయాణం సాగించాలని రెవెన్యూ శాఖ అధికారులు పేర్కొన్నారు. అరకు రైలు ప్రారంభం కావడంతో పర్యాటకులపై ఆధారపడిన వ్యాపారులు, అద్దె వాహన డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకుల రద్దీ పెరిగితే… అరకు రైలుకు అద్దాల విస్టాడోమ్ కోచ్‌లు తగిలించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
Also Read: ‘ఖాకీ’ మూవీ స్టైల్లో దొంగతనాలు.. 15 ఏళ్లుగా ఆగడాలు.. పార్థీ గ్యాంగ్ ఆట కట్టించిన పోలీసులు