AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ట్రాఫిక్‌లో బోర్‌ కొట్టిందని పక్కనే ఉన్న మొసళ్ల నదిలో దూకేశాడు.. ఆ తర్వాత షాక్

మహానగరాల్లో ట్రాఫిక్ కష్టాలు మామూలే. మీరు ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే ఏం చేస్తారు.. ఫోన్ తీసి టైంపాస్ చేస్తారు.. లేకపోతే కారులోనే ఉండి సాంగ్స్..

Viral Video: ట్రాఫిక్‌లో బోర్‌ కొట్టిందని పక్కనే ఉన్న మొసళ్ల నదిలో దూకేశాడు.. ఆ తర్వాత షాక్
Man Jumps Into River
Ram Naramaneni
|

Updated on: Jul 16, 2021 | 8:13 AM

Share

మహానగరాల్లో ట్రాఫిక్ కష్టాలు మామూలే. మీరు ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే ఏం చేస్తారు.. ఫోన్ తీసి టైంపాస్ చేస్తారు.. లేకపోతే కారులోనే ఉండి సాంగ్స్ వింటూ కూర్చుంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు. ఇతడు చేసిన పిచ్చి పనిని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ట్రాఫిక్‌లో బోర్‌ కొట్టిందని ఇతగాడు రోడ్డు ప్రక్కనే ఉన్న మొసళ్ల నదిలోకి దూకాడు. చావు తప్పి కన్నులొట్టపోయినట్లు.. అదృష్టం బాగుండి బయటపడ్డాడు. క్షేమంగా బయటపడటానికి అతను చాలానే శ్రమించాల్సి వచ్చింది. బయటపడ్డానని సంతోషించేలోపే.. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన అమెరికాలోని లూసియానాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. లూసియానాకు చెందిన జిమ్మి ఇవాన్‌ జెన్నింగ్స్‌… కొద్ది రోజుల క్రితం నదిపై ఉన్న వంతెనపై ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాడు. 2 గంటలు గడిచినా ట్రాఫిక్‌ క్లియర్‌ కాలేదు. దీంతో బోర్‌ కొట్టి.. పక్కనే ఉన్న నదిలోకి దూకేశాడు. అయితే ఆ నదిలో ముసళ్లు ఉన్నట్లు అతడికి తెలియదు. నీళ్లలో పడ్డ తర్వాత అతడి నోటికి, ఎడమ చేతికి గాయమైంది. ఈత కొట్టడానికి ఇబ్బంది పడ్డాడు.

అలా దాదాపు గంటన్నర పాటు ఈదుతూనే ఉన్నాడు జిమ్మి. ఈత కొట్టే ఓపిక నశించినా ప్రాణం మీద ఆశతో ముందుకు వెళ్లాడు. చివరకు ఓ ఇసుక తిన్నెమీదకు చేరుకున్నాడు. ఆ తర్వాత నడుచుకుంటూ ఊర్లోకి అడుగుపెట్టాడు. అక్కడ పోలీసులు జిమ్మిని అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు… జిమ్మి చేసిన పిచ్చి పనిని తప్పుబడుతున్నారు.

వీడియో దిగువన వీక్షించండి…

Also Read:  ‘ఖాకీ’ మూవీ స్టైల్లో దొంగతనాలు.. 15 ఏళ్లుగా ఆగడాలు.. పార్థీ గ్యాంగ్ ఆట కట్టించిన పోలీసులు

వైసీపీ ఎంపీల ఫిర్యాదు నేపథ్యంలో ఎంపీ రఘురామకు లోక్‌సభ సచివాలయం నోటీసులు

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్