AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ‘ఖాకీ’ మూవీ స్టైల్లో దొంగతనాలు.. 15 ఏళ్లుగా ఆగడాలు.. పార్థీ గ్యాంగ్ ఆట కట్టించిన పోలీసులు

‘ఖాకీ’ సినిమా గుర్తుంది కదా.. ఆ మూవీలో దొంగతనాలు చూస్తే... ఒళ్లు జలదరిస్తుంది. సినిమాలో చూస్తేనే అలా ఉంటే... మరి రియల్ లైఫ్‌లో ఫేస్ చేస్తే.....

Hyderabad: ‘ఖాకీ’ మూవీ స్టైల్లో దొంగతనాలు.. 15 ఏళ్లుగా ఆగడాలు.. పార్థీ గ్యాంగ్ ఆట కట్టించిన పోలీసులు
Arrested
Ram Naramaneni
|

Updated on: Jul 16, 2021 | 7:49 AM

Share

‘ఖాకీ’ సినిమా గుర్తుంది కదా.. ఆ మూవీలో దొంగతనాలు చూస్తే… ఒళ్లు జలదరిస్తుంది. సినిమాలో చూస్తేనే అలా ఉంటే… మరి రియల్ లైఫ్‌లో ఫేస్ చేస్తే.. ఏంటి పరిస్థితి. కానీ హైదరాబాద్ ప్రజలు 15 ఏళ్లుగా అలాంటి గ్యాంగ్‌ ఆగడాలతో అల్లాడుతున్నారు. పార్థీ గ్యాంగ్.. మధ్యప్రదేశ్ నుంచి వచ్చేస్తుంది. నగరంలో పంజా విసురుతుంది. గుర్తించే లోపే వెళ్లిపోతుంది. 15 ఏళ్లుగా చుక్కలు చూపిస్తున్న ఈ ఘరానా దొంగల ముఠా ఆటకట్టించారు హైదరాబాద్ పోలీసులు. పార్థీ గ్యాంగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. నగరంలో కొంతకాలంగా ఈ గ్యాంగ్ వరుస దొంగతనాలు చేస్తోంది.

మధ్యప్రదేశ్‌కు చెందిన పార్థీ గ్యాంగ్ సభ్యులు.. దర్జాగా వస్తారు.. ఖరీదైన కార్లలో దిగుతారు.. కట్టూ బొట్టుతో కనికట్టు చేసి మాయ చేస్తారు. అదును చూసి అందినంత దోచుకుంటారు. అంతే దర్జాగా భోపాల్ చెక్కేస్తారు. ఇదీ పార్థీ గ్యాంగ్ స్టయిల్.. వీరు మరో స్టైల్ కూడా ఫాలో అవుతారు.  రుద్రాక్షలు, ఆయుర్వేదిక్‌ మూలికలను విక్రయించే ముసుగులో నిర్మానుష్యంగా ఉండే శివారు ప్రాంతాల్లో ఈ ముఠా సంచరిస్తుంది. తాళం ఉన్న ఇళ్లతో పాటు ఇంటిలో ఒంటరిగా ఉండే వారిని ఎంచుకుని చోరీలకు తెగబడుతారు.  ఈ చోరీగాళ్లు.. పోలీసులకు 15 ఏళ్లుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. సైబరాబాద్ , హైదరాబాద్, రాచకొండ, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ దోపిడీలు చేసింది.

పార్థీ గ్యాంగ్ క్రైం మామూలుగా ఉండదు. చోరీ చేసే సమయంలో ఎవరైనా అడ్డొస్తే వారి సంగతి అంతే ఇక. ఈ గ్యాంగ్ సిటీలో అడుగుపెడితే… ప్రజలకు వణుకే. వారి కన్నుపడ్డ ఇళ్లు లూటీ కావాల్సిందే. కాలానికి తగ్గట్లు ట్రెండ్ మార్చుకుంటూ.. దోపిడీలు చేస్తోంది పార్థీ గ్యాంగ్. 2005 నుంచి నగరంలో పంజా విసురుతోంది. దొంగతనం చేసిన తర్వాత ఏ ఆధారం దొరక్కకుండా జాగ్రత్త పడటం వీరి నైజం.

Also Read: వైసీపీ ఎంపీల ఫిర్యాదు నేపథ్యంలో ఎంపీ రఘురామకు లోక్‌సభ సచివాలయం నోటీసులు

 ఫుల్లుగా మందుకొట్టి కారు డ్రైవ్ చేస్తూ.. మేడ్చల్‌లో మందుబాబు అరాచకం

బాలయ్య రెడీ.. ఇక దండయాత్రే బ్యాలెన్స్
బాలయ్య రెడీ.. ఇక దండయాత్రే బ్యాలెన్స్
వామ్మో.. తులం బంగారం రూ.4.5 లక్షలు..! భయపెడుతున్న నోస్ట్రాడమస్..
వామ్మో.. తులం బంగారం రూ.4.5 లక్షలు..! భయపెడుతున్న నోస్ట్రాడమస్..
గ్రాండ్ ఎంపరర్ హోటల్ కింద నిధి? కోట్ల విలువైన బంగారు ఇటుకలు..
గ్రాండ్ ఎంపరర్ హోటల్ కింద నిధి? కోట్ల విలువైన బంగారు ఇటుకలు..
గుడ్‌న్యూస్‌.. మళ్లీ రోడ్లపైకి డబుల్‌ డెక్కర్‌ బస్సులు..ఛార్జీలు
గుడ్‌న్యూస్‌.. మళ్లీ రోడ్లపైకి డబుల్‌ డెక్కర్‌ బస్సులు..ఛార్జీలు
భారత్, పాక్ మ్యాచ్‌పై కొత్త ట్విస్ట్.. బంగ్లాదేశ్ ఎంట్రీతో..?
భారత్, పాక్ మ్యాచ్‌పై కొత్త ట్విస్ట్.. బంగ్లాదేశ్ ఎంట్రీతో..?
గోవా వెళ్తున్నారా..? ఇది చేస్తే 24 గంటల పాటు జైలుశిక్ష
గోవా వెళ్తున్నారా..? ఇది చేస్తే 24 గంటల పాటు జైలుశిక్ష
సౌందర్య స్టార్ హీరోయిన్.. అయినా ఆ సీన్ కోసం అలా చేసింది..
సౌందర్య స్టార్ హీరోయిన్.. అయినా ఆ సీన్ కోసం అలా చేసింది..
టీ20 ప్రపంచకప్‌ను హీటెక్కించిన నేపాల్.. చివరి బంతి వరకు చుక్కలే
టీ20 ప్రపంచకప్‌ను హీటెక్కించిన నేపాల్.. చివరి బంతి వరకు చుక్కలే
ముక్క ముట్టని పెద్ద పులి.. కేవలం ద్రవాహారం మాత్రమే.. ఎందుకంటే
ముక్క ముట్టని పెద్ద పులి.. కేవలం ద్రవాహారం మాత్రమే.. ఎందుకంటే
అంత్యక్రియలకు వెళ్లి వచ్చాక స్నానం ఎందుకు చేస్తారో తెలుసా?
అంత్యక్రియలకు వెళ్లి వచ్చాక స్నానం ఎందుకు చేస్తారో తెలుసా?