AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Encounter : శ్రీనగర్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కర్ ఉగ్రవాదుల హతం.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..

Encounter : శ్రీనగర్‌లో గురువారం అర్థరాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులను హతమార్చాయి. ఇంకా ఇరువర్గాల నుంచి కాల్పులు

Encounter : శ్రీనగర్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కర్ ఉగ్రవాదుల హతం.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..
Encounter 1
uppula Raju
|

Updated on: Jul 16, 2021 | 9:30 AM

Share

Encounter : శ్రీనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులను హతమార్చాయి. ఇంకా ఇరువర్గాల నుంచి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. శ్రీనగర్‌లోని డాన్మార్ ప్రాంతంలోని అలమ్‌దార్ కాలనీలో పోలీసులు, సైన్యం సంయుక్త సెర్చ్ ఆపరేషన్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లుగా గుర్తించారు. భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ప్రారంభించిన వెంటనే ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య బుధవారం ఎన్‌కౌంటర్ జరిగింది. కొంతమంది ఉగ్రవాదులు ఇక్కడ దాక్కున్నట్లుగా భద్రతా దళాలకు సమాచారం అందింది. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కర్‌కు చెందిన పాకిస్తాన్ కమాండర్ ఎజాజ్ అలియాస్ అబూ హురైరాతో సహా 3 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. హతమార్చిన ఉగ్రవాదుల నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

అదే సమయంలో జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో పోప్లర్ చెట్టు కింద ఉగ్రవాదులు పెట్టిన బాంబును భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. పోలీసు ప్రతినిధి మాట్లాడుతూ “ఖాజిగుండ్ ప్రాంతంలోని డామ్‌జెన్ గ్రామ శివార్లలోని పోప్లర్ చెట్టు కింద ఒక ఐఈడి కనిపించింది.” పోలీసులు సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. బాంబు స్క్వాడ్ బృందాన్ని పిలిపించి బాంబును నిర్వీర్యం చేసినట్లు” తెలిపారు. జూలై 8 న పుల్వామాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద కమాండర్ బుర్హాన్ వాని హత్య జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా లోయలోని కొన్ని ప్రాంతాలు మూసివేస్తుండగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. అదే రోజు జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. హతమార్చిన ఉగ్రవాదులను లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థకు చెందిన కిఫాయత్ రంజాన్ సోఫీ, అల్ బదర్‌కు చెందిన ఇనాయత్ అహ్మద్ దార్‌గా గుర్తించారు.

Vastu Tips : ఉత్తమ నిద్ర కోసం వాస్తు చిట్కాలు..! ఈ తప్పులు చేస్తే మీకు ప్రశాంతమైన నిద్ర ఎప్పటికీ దొరకదు..

Gazette reactions: ‘మా ట్యాగ్ లైన్ నీళ్లు’. నీళ్ల కోసం రాజ్యాలు కూలిపోయాయి.. తక్షణమే గెజిట్ వెనక్కి తీసుకోకుంటే ఖబడ్దార్.!

Khanamet lands: నిన్న కోట్లు కురిపించిన కోకాపేట భూములు.. ఇవాళ ఖానామెట్‌ భూముల ఈ-వేలం