Gazette reactions: ‘మా ట్యాగ్ లైన్ నీళ్లు’. నీళ్ల కోసం రాజ్యాలు కూలిపోయాయి.. తక్షణమే గెజిట్ వెనక్కి తీసుకోకుంటే ఖబడ్దార్.!

తెలుగు రాష్ట్రాల కృష్ణా జలాల నీటి వివాదానికి సంబంధించి కేంద్రం అర్థరాత్రి విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ మీద ఎమ్మెల్యే జీవన్ రెడ్డి..

Gazette reactions: 'మా ట్యాగ్ లైన్ నీళ్లు'. నీళ్ల కోసం రాజ్యాలు కూలిపోయాయి.. తక్షణమే గెజిట్ వెనక్కి తీసుకోకుంటే ఖబడ్దార్.!
Mla Jeevan Reddy
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 16, 2021 | 10:00 AM

Krishna waters – Jeevan Reddy: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల నీటి వివాదానికి సంబంధించి కేంద్రం అర్థరాత్రి విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ మీద ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. నీళ్ళని కేంద్రం పరిధిలోకి తీసుకొని మా హక్కులు కాలరాస్తాం.. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉరుకోమని జీవన్ రెడ్డి అన్నారు. అవసరమైతే, నీళ్ల కోసం మళ్ళీ ఉద్యమం చేపడతామన్నారు.

“మాకు నీళ్ల కోసం నిధులు కూడా ఇవ్వలేదు కేంద్రం. మా ప్రాజెక్టుల దగ్గర కేంద్ర బలగాలు పెడతారా.? తెలంగాణ ఉద్యమం పుట్టింది నీళ్ల కోసం.. మా ట్యాగ్ లైన్ నీళ్లు. నీళ్ల కోసం యుద్ధం జరిగింది. నీళ్ల కోసం రాజ్యాలు కూడా కూలిపోయాయి. అలాంటి నీళ్ళని కేంద్రం పరిధిలోకి తీసుకొని మా హక్కులు కాల రాస్తాం అంటే ఉరుకోం.. ఖబడ్దార్.” అంటూ జీవన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

మోదీ సర్కారు తక్షణమే కృష్ణాజలలాకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన జీవన్ రెడ్డి, అవసరం అయితే నీళ్ల కోసం మళ్ళీ త్వరలోనే ఉద్యమం చేస్తామన్నారు. ఇదిలాఉండగా, కృష్ణా జలాల నీటి వినియోగం మీద తెలుగు రాష్ట్రాలకు కేంద్రం డైరెక్షన్ ఇచ్చింది. ఇటీవల కొంత కాలంగా ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదానికి చరమగీతం అన్నట్టుగా ఒక్కో రాష్ట్రానికి నీటి వాటా ఎంత? వినియోగించాల్సింది ఎంత? అనే దానిపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం. కృష్ణా, గోదావరి నదుల గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెండు యాజమాన్య బోర్డుల పరిధులు ఖరారు చేసింది కేంద్ర జల శక్తి శాఖ. అన్ని ప్రాజెక్టుల నిర్వహణ బోర్డులే చూసుకుంటాయని కేంద్రం స్పష్టం చేసింది.

అంతేకాదు, బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపుల ప్రాజెక్టులను కృష్ణాబోర్డు పరిధిలో చేర్చింది కేంద్ర జలశక్తి శాఖ. కృష్ణా, గోదావరి నదీ యజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ అర్ధరాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫలితంగా బోర్డుల పరిధిలోకి కృష్ణానదిపై ఉన్న 36, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులు వస్తాయి. అనుమతి లేని ప్రాజెక్టులకు 6 నెలల్లోగా అనుమతులు తెచ్చుకోవాలి. అనుమతులు రాకపోతే ప్రాజెక్టులు నిలిపివేయాలని కేంద్రం స్పష్టం చేసింది. అక్టోబర్‌ 14 నుంచి గెజిట్‌ నోటిఫికేషన్లు అమల్లోకి రానున్నాయి.

ఇక, ఈ అంశానికి సంబంధించి ఒక్కో రాష్ట్రం బోర్డుకు 200 కోట్ల రూపాయల చొప్పున డిపాజిట్‌ చేయాలి. సీడ్‌ మనీ కింద ఈ మొత్తాన్ని 60 రోజుల్లో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. నిర్వహణ ఖర్చులను అడిగిన 15 రోజుల్లో చెల్లించాలని కేంద్రం సూచించింది. ఈ నోటిఫికేషన్ నేపథ్యంలో తెలంగాణ రాజకీయ పార్టీలు, నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు.

Read also: Chalo Raj Bhavan: కాంగ్రెస్ పార్టీ ఇవాళ ‘చలో రాజ్ భవన్’ పిలుపు.. రాజధానిలో హై టెన్షన్. !

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?