ఎయిర్‌పోర్టులో ఉద్యోగం ఇప్పిస్తామని యువతిని ట్రాప్‌ చేసిన కేటుగాళ్లు.. మొబైల్‌ యాప్‌ పేరుతో మరో చోట భారీ మోసం

Cyber ​​Crime Police: ఉద్యోగం ఇప్పిస్తామని కొందరు.. మొబైల్‌ యాప్‌లో పెట్టుబడులు పెడితే రెట్టింపు ఆదాయం వస్తుందని మరి కొందరు.. అమ్మాయి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సేకరించి..

ఎయిర్‌పోర్టులో ఉద్యోగం ఇప్పిస్తామని యువతిని ట్రాప్‌ చేసిన కేటుగాళ్లు.. మొబైల్‌ యాప్‌ పేరుతో మరో చోట భారీ మోసం
Follow us
Subhash Goud

|

Updated on: Jul 17, 2021 | 7:16 AM

Cyber ​​Crime Police: ఉద్యోగం ఇప్పిస్తామని కొందరు.. మొబైల్‌ యాప్‌లో పెట్టుబడులు పెడితే రెట్టింపు ఆదాయం వస్తుందని మరి కొందరు.. అమ్మాయి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సేకరించి చెప్పినట్లు వినాలని మరి కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాలు హైదరాబాద్‌ నగర ప్రాంతంలో ఎన్నో జరుగుతున్నాయి. వీటిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కేటుగాళ్లను కటకటాల వెనక్కి నెట్టేస్తున్నారు.

ఇక ఎయిర్‎పోర్ట్‎లో ఉద్యోగం ఇప్పిస్తామని యువతిని ట్రాప్ చేసి కేటుగాళ్లు మోసం చేశారు. కాాగా,  ఉద్యోగం కోసం జాబ్ సైట్లలో ఆ యువతి దరఖాస్తు చేసుకుంది. రెండు రోజుల తర్వాత బాధితురాలకు ఓ పలాన.. డాట్ కామ్ నుండి కాల్ చేస్తున్నామని చెప్పారు. మీకు శంషాబాద్ ఎయిర్‎పోర్ట్‎లో జాబ్ కన్ఫామ్ అయిందని, రూ.లక్షకు పైగా ఫీజు చెల్లించాలని వారు సూచించారు. దీంతో వారి మాటలను నమ్మిన ఆ యువతి లక్ష రూపాయలకు పైగా డబ్బులను పంపించింది. డబ్బులు పంపిన మరుక్షణం నుంచి కేటుగాళ్ల ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వారి చేతిలో నిలువునా మోసపోయానని తెలుసుకుని లబోదిబోమంది. వెంటనే బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

మొబైల్‌ యాప్‌లో పెట్టుబడి పేరుతో భారీ మోసం

అలాగే మొబైల్‌ యాప్‌లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం జరిగింది. అవినాష్‌ కుమార్‌ అనే వ్యక్తిని కేటుగాళ్లు ట్రాప్‌ చేశారు. అతనితో రెండు లక్షలు.. అతని ఏడుగురు స్నేహితుల ద్వారా మరో 10 లక్షలకు పైగా లక్కీ స్టార్ జెన్సిక్ అనే మొబైల్ యాప్స్ లో పెట్టుబడి పెట్టించారు కేటుగాళ్లు. ఇక మొబైల్‌ యాప్స్‌ లింక్‌లను కేటుగాళ్లు డిలీట్‌ చేశారు. వారి చేతులో మోసపోయిన బాధితులు సిటీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్

ఇదిలా ఉండగా, కొందరు అమ్మాయిల ఫోన్‌ల నుంచి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు కాపీ చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఓ స్నేహితురాలు ఫోన్‌ నుంచి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను ఇద్దరు యువకులు కాపీ చేశారు. తాము చెప్పినట్లు వినకపోతే వాటిని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తామని బాధితురాలికి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ యువతి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వీటిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, ఇలా నేరాలు, బెదిరింపులు, ఆన్‌లైన్‌ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు పోలీసులు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. అయినా ఇంకా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇలాంటి వాటిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

ఇవీ కూడా చదవండి:

Hyderabad: ‘ఖాకీ’ మూవీ స్టైల్లో దొంగతనాలు.. 15 ఏళ్లుగా ఆగడాలు.. పార్థీ గ్యాంగ్ ఆట కట్టించిన పోలీసులు

Cyber Crime: హైదరాబాద్ ఆయుర్వేదిక్ వైద్యురాలికే టోకరా.. రూ. 41 లక్షలు స్వాహా.. సైబర్ కేటుగాడు నైజీరియన్ అరెస్ట్!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?