Cyber Crime: హైదరాబాద్ ఆయుర్వేదిక్ వైద్యురాలికే టోకరా.. రూ. 41 లక్షలు స్వాహా.. సైబర్ కేటుగాడు నైజీరియన్ అరెస్ట్!

సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. అందిన కాడికీ దోచుకుంటున్నారు. వీళ్లు, వాళ్లూ అనే తేడా లేదు. అందరినీ ముంచేస్తున్నారు.

Cyber Crime: హైదరాబాద్ ఆయుర్వేదిక్ వైద్యురాలికే టోకరా..  రూ. 41 లక్షలు స్వాహా.. సైబర్ కేటుగాడు నైజీరియన్ అరెస్ట్!
Nigerian Cyber Criminal Arrested
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 15, 2021 | 6:02 PM

Nigerian Cyber Criminal arrested in Hyderabad: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. అందిన కాడికీ దోచుకుంటున్నారు. వీళ్లు, వాళ్లూ అనే తేడా లేదు. అందరినీ ముంచేస్తున్నారు. అన్ని తెలిసివాళ్లు కూడా ఈ కేటుగాళ్ల మాయలో పడిపోతున్నారు. తాజాగా విదేశాలకు ముడి పదార్థాలను ఎగుమతి ఆశజూపి రూ. 41 లక్షలు మోసం చేసిన సైబర్ కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంఆయుర్వేదిక్ వైద్యురాలిని టార్గెట్ చేసి సైబర్ ఫ్రాడ్స్‌కు పాల్పడిన నైజీరియన్ నేరగాడిని అరెస్ట్ చేశారు. విదేశాలకు హెర్బల్ ముడిపదార్థాల ఎగుమతి పేరుతో వైద్యురాలిని నైజీరియన్ వ్యక్తి మోసం చేశాడు. మెహదీపట్నం ప్రాంతానికి చెందిన ఆయుర్వేద వైద్యురాలతో ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు ఓ నైజీరియన్. ఇద్దరు మధ్య వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. ఇదే క్రమంలో ఆయుర్వేదిక్ వైద్యురాలికి ఫోన్ చేసి హెర్బల్ ముడిపదార్థాల ఎగుమతి చేస్తూ బాగా గడించవచ్చని నమ్మబలికాడు. దీంతో నమ్మకం ఆమెకు నమ్మకం కలిగించేందుకు వివిధ ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాడు.

ఇదే క్రమంలో వైద్యురాలి మూలికల ఫార్ములా తెలిపితే రూ.5 కోట్లు ఇస్తామని ఆశజూపాడు. ఇందుకు అంగీకరించిన సదరు వైద్యురాలు ఒకే చెప్పేసింది. అయితే, ఇక్కడే ఓ మెలిక పెట్టాడు. మొత్తం డబ్బులు చేరాలంటే కొంత సొమ్ము టాక్స్ రూపంలో చెల్లించాలన్నాడు. దీంతో తిరిగి ఆ వైద్యురాలి నుండి ట్యాక్స్ పేరుతో 41 లక్షలు నైజీరియన్ నేరగాడు కాజేశాడు. తాను మోసపోయానని గ్రహించిన వైద్యురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ పోలీసులు.. ముంబై, బెంగుళూర్ కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ కు తరలించారు. Read Also… Minister KTR: ఆ రోడ్లను మూసివేయకుండా ఆదేశాలివ్వండి.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌కి మంత్రి కేటీఆర్ లేఖ..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే